📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో కుటుంబ రాజకీయాల హాట్‌ఫైట్

Author Icon By Pooja
Updated: December 7, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు( Sarpanch Elections) ఎన్నో విచిత్ర పరిణామాలకు వేదికగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పంచాయతీలో ఒక వినూత్న ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ పదవిని గెలుచుకోవాలంటే తనతో పాటు తన భార్య కూడా పోటీలో ఉండాలని జ్యోతిష్య సలహా రావడంతో స్థానిక అభ్యర్థి నారగోని మహేష్, తన సతీమణి నారగోని శ్రీలతకూ నామినేషన్ దాఖలు(Filing of nomination) చేయించారు. శనివారం విడుదలైన నమూనా బ్యాలెట్ పేపర్‌పై భార్యాభర్తలిద్దరి పేర్లు కనిపించడంతో గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సెంటిమెంట్ మహేష్‌కు విజయాన్ని అందిస్తుందా లేదా అనేది ఫలితాలు వెలువడే వరకు మిస్టరీగానే ఉంది.

Read Also: Strong Room Check: పోలింగ్ మెటీరియల్ భద్రతపై పర్యవేక్షణ

Sarpanch Elections: Hot fight of family politics in Telangana Sarpanch elections

ఇక జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరాంనగర్ పంచాయతీలో(Sarpanch Elections) రాజకీయ పోటీ కుటుంబంలోనే హోరాహోరీగా మారింది. 253 మంది ఓటర్లున్న ఈ చిన్న పంచాయతీలో మాజీ సర్పంచ్ తాళ్లపెల్లి సత్యనారాయణ, అతని కోడలు రాధిక నేరుగా సర్పంచ్ పదవికి బరిలో ఉన్నారు. మొదట సత్యనారాయణ కుమారుడు శ్రీరామ్ కూడా పోటీకి దిగినా, నామినేషన్ ఉపసంహరణ సమయంలో ఆయన తప్పుకోవడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. వీరితో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు కూడా మెదానంలో ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన మామా–కోడళ్ల మధ్య నేరుగా పోటీ నెలకొనడంతో ఈ ఎన్నికలు స్థానికంగా పెద్ద చర్చనీయాంశమయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

BeeBinagar ElectionUpdates FamilyPolitics Google News in Telugu Latest News in Telugu TelanganaElections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.