హనీపాట్ పేరిట సైబర్ నేరగాళ్ల భరతం పట్టేందుకు హైదరాబాద్ ఐఐఐటితో ఒప్పందం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న హనీ ట్రాప్ కేసులను కనీస స్థాయికి తగ్గించేందుకు తెలంగాణ సైబర్ సె క్యూరిటీ బ్యూరో (TGCSB) కొత్త తరహా అస్త్రాన్ని ఎంచుకుంది. అమాయకులను హనీ ట్రాప్ ద్వారా వంచించి కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్ల భరతం పట్టేందుకు టిజిసిఎస్బి హనీపాట్ పేరిట కొత్త కార్యక్రమాన్ని చేబట్టేందుకు హైదరాబాద్ ఐఐఐటితో ఒప్పందం ఒప్పదం కుదుర్చుకుంది. కేవలం హనీట్రాప్ కేసుల్లో నేరగాళ్లుగా వుండే వారిని ఆకర్షించేందుకే హనీపాట్ను అమలు చేయనున్నారు. ఈ తరహా ఘటనల్లో పోలీసులకు ఫిర్యాదులు అందు తున్నవి తక్కువేనని టిజిసిఎస్బి అధికారులు చెబుతున్నారు.
మెజారిటీ ఘటనల్లో బాధితులు కుటుంబ పరువు కోసం గప్చిప్గా వుంటున్నారు. అయితే నేరగాళ్లు పదే పదే బ్లాక్ మెయిలింగ్కు దిగడంతో తప్పనిసరి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు. ఇక ఈ తరహా కేసుల్లో సైబర్ నేరగాళ్లు (Cyber criminals)ఎక్కువగా మాల్వేర్ టెక్నాలజిని వాడి మెయిల్స్ పంపుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఇందుకోసం నకిలీ నెట్వర్క్లు సృష్టించి తప్పుడు ప్రొఫైళ్లు తయారు చేస్తు న్నారని కూడా తేలింది. ఇందుకుగానూ సమా జంలో పలుకుబడి, డబ్బున్న వారిని సోషల్ మీడియా ద్వారా చిరునామాలు సేకరించడం సైబర్ నేరగాళ్లు చేస్తుంటారని పోలీ సుల విచా రణలో తేలింది. దీని తరువాత అందమైన యువతుల ఫోటోలను తమ ప్రొఫైళ్లలో వుంచుకుని ముందుగా సైబర్ నేరగాళ్లు పరిచయం చేసుకుంటారు. ఆనక మాటలు కలిపి చివరగా హనీ ట్రాప్ను అమలు చేసి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతారు.
హనీ ట్రాపు విరుగుడు హనీపాట్:
హనీట్రాప్కు విరుగుడుగా టిజిసిఎసిబి అధికారులు కొత్తగా హనీపాట్ను అమలు చేయసాగారు. కేవలం హనీ ట్రాప్ కేసుల్లో బాధితులుగా వున్న వారిని కాపాడేందుకు హనీ పాట్ పేరిట ఓ నెట్ వరు తీసుకువస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు మారు వేషంలో వెళ్లి రహస్య ఆపరేషన్లు చేబట్టినట్లుగా చెప్పాలి. ఇందుకోసం హైదరాబాద్ ఐఐఐటిలో ప్రత్యేకంగా ఒక హబు ఏర్పాటు చేస్తున్నారు. ఈ హబ్లో ఇప్పటికే చిన్నపాటి పనులు మొదలవగా పూర్తిస్థాయిలో త్వరలో ప్రారంభంకానున్నాయి
Read hindi news: hindi.vaartha.com
Read Also: