Hit and Run Case Hyderabad: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో ఆదివారం రాత్రి ఒక బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్నాడో లేక అతివేగమో కానీ, కారు డ్రైవర్ సృష్టించిన హంగామాతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
Read Also: MJTEL ట్రస్ట్‌లో న్యాయం కోసం ప్రిన్స్ ఆజం జా పోరాటం
నానక్‌రామ్‌గూడలో మొదలైన విధ్వంసం
నానక్‌రామ్‌గూడ సమీపంలో అతివేగంగా దూసుకువచ్చిన ఒక బెంజ్ కారు, అదుపు తప్పి మరో కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఆగకుండా డ్రైవర్ కారును మరింత వేగంతో ముందుకు పోనిచ్చాడు. దీంతో బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దీనిపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కారును ఆపేందుకు ప్రయత్నించాడు. కానిస్టేబుల్ వైపు కారు దూసుకురావడంతో అతడు బానెట్ పై పడిపోయాడు. దాదాపు కిలోమీటర్ మేర అతడిని ఈడ్చుకెళ్లాడు. ఇతర వాహనదారుల సహాయంతో కారును ఆపి, పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: