📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Bharat Summit : సీఎం రేవంత్ స్పీచ్ హైలైట్స్

Author Icon By Sudheer
Updated: April 26, 2025 • 7:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ సమ్మిట్ సందర్భంగా హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీ వేదికగా జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ విజయాలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మాటే పాలనకు మార్గదర్శకమని, వారి ఆకాంక్షల్ని నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. దావోస్ పర్యటన ఫలితంగా లక్ష కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ఉద్దేశంతో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం దేశంలోనే అతిపెద్ద రూ.2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు గుర్తు చేశారు.

అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించడంతోపాటు, సాగు భూములకు ‘రైతు భరోసా’ పథకం కింద ఎకరానికి రూ.12 వేలు మంజూరు చేస్తున్నామని సీఎం వివరించారు. అలాగే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి, సన్న వడ్లకు బోనస్ కూడా అందజేస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో నిరుద్యోగులకు న్యాయం జరగకపోయినా, తాము ఏడాదిలోనే 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల బలోపేతం ద్వారా మహిళలకు ఆర్థిక శక్తి పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వివరించారు.

సామాజిక న్యాయం, అభివృద్ధికి కొత్త పథకాలు

ప్రతి వర్గానికి సముచిత న్యాయం చేయడానికి ఇటీవల ఎస్సీ వర్గీకరణ చేపట్టినట్టు రేవంత్ తెలిపారు. తొలిసారిగా త్రీడ్జెండర్‌లను పోలీసు శాఖలో నియమించిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో నగర అభివృద్ధిని జరిపేందుకు ప్రభుత్వం సిద్దమైందని తెలిపారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ‘రాజీవ్ ఆరోగ్య శ్రీ’ పథకం కింద రూ.10 లక్షల వరకు సహాయం అందించనున్నట్లు వివరించారు. తలసరి ఆదాయంలో దేశంలో టాప్‌లో నిలిచిన గర్వాన్ని ప్రజలతో పంచుకున్నారు.

Read Also : Rahul Gandhi: అణచివేసే దూకుడు రాజకీయాలతో వేసారి పోతున్నామన్నా రాహుల్

Bharat Summit 2025 cm revanth cm revanth speech Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.