📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు

Author Icon By sumalatha chinthakayala
Updated: January 6, 2025 • 10:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: ఫార్ములా-ఈ కారు రే సు కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోమవారం మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించనుంది. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. న్యాయ నిపుణుల సూచన మేరకు ఈ కేసులో విచారణకు హాజరవుతానని కేటీఆర్‌ కూడా శనివారం బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల సమావేశంలో తెలిపారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలంటూ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్ర యించారు.

ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని పేర్కొంది. అయితే విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ను విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులిచ్చింది. దీంతో సోమవారం జరగనున్న పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇదే కేసులో ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. కాగా, ఈ కేసులో సహనిందితులుగా ఉన్న బీఎల్‌ఎన్‌ రెడ్డి, అరవిందకుమార్‌లనూ ఈ నెల 2, 3వ తేదిల్లోనే విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేయగా.. వారిద్దరు కొంత సమయం కావాలని రాతపూర్వకంగా కోరారు. దీంతో వారికి ఈడీ అధికారులు వారం రోజుల వ్యవధి ఇచ్చారు.

కాగా, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్‌కు కంటే ముందు తెలంగాణ భవన్ కు రానున్నారట. దీంతో తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ నెలకొంది.అయితే ఏసీబీ విచారణకు KTR హాజరవుతున్న నేపథ్యంలో BRS నేతల ముందస్తు అరెస్ట్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ‌సహా 100 మంది బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు హౌస్ అరెస్ట్‌ అయ్యారు. అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బందోబస్తు చర్యలకు పోలీసులు సిద్దమవుతున్నారు.

Formula-E Care Race High tension ktr police deployment telangana bhavan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.