📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు

Author Icon By sumalatha chinthakayala
Updated: January 7, 2025 • 10:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇటీవల వాదనలు..ముగిశాయి. వాదనలో కేటీఆర్ క్వాష్ ను కొట్టివేయ్యాలని ఏసీబీ పేర్కొంది. ఇరు పక్షాల వాదనల అనంతరం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దన్న హైకోర్టు…ఇవాళ ఉదయం 10:30 న్నర గంటల సమయాన తీర్పు వెల్లడించనుంది.

image

నేడు హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఇప్పటికే ఏసీబీ విచారణకు మాజీమంత్రి కేటీఆర్ లీగల్ టీంతో వెళ్లారు. తన వెంట లీగల్ టీం ని అనుమతించకపోవడంతో ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్లలేదు. దీంతో విచారణ అంశాన్ని కోర్టుకు దృష్టికి ఏసీబీ తీసుకెళ్లనుంది. ఇక ఇవాళ్టి తీర్పు మీదే కేటీఆర్ ఆశలు పెట్టుకున్నారు. ఏసీబీ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థల దర్యాప్తుతో ఫార్ములా ఈ రేస్ కొనసాగుతోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరు కాలేనని ఈడికి తెలిపారు కేటీఆర్. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రిక్వెస్ట్ ని ఆమోదించిన ఈడి తదుపరి విచారణ తేదీ ప్రకటించలేదు.

అయితే నేడు ఈడీ విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు అందాయి. అయితే తాను విచారణకి హాజరు కాలేనని ఈడి ఇచ్చిన నోటీసులకి కేటీఆర్ లేఖ రాశారు. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వు ఉందని, హైకోర్టు పైన ఉన్న గౌరవంతో… హైకోర్టు తీర్పును వెలువరించేంతవరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని కోరారు. తర్వాత పంపిన తేదీకి తప్పక రావాల్సి ఉంటుందని ఈడీ నుంచి కూడా కేటీఆర్ కు సమాధానం వచ్చింది.

formula e car race High Court verdict ktr Quash Petition Telangana High Court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.