పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జూన్ 30న చోటు చేసుకున్న ప్రమాదంలో 54 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తెలంగాణలో జరిగిన అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదం జరిగి 5 నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ బాధ్యులు ఎవరో గుర్తించలేదు. ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తు తీరుపై తెలంగాణ హైకోర్టు (TG High Court) గురువారం (నవంబర్ 27) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: Earthquake: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు
తదుపరి విచారణ డిసెంబర్ 9కి వాయిదా
ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై గురువారం హైకోర్టు (TG High Court విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసుల వైఖరిపై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. “ఇప్పటికే 237 మంది సాక్షులను విచారించినా పురోగతి ఏది? పేలుడుకు బాధ్యులైన వారిని ఇప్పటివరకు ఎందుకు గుర్తించలేదు?” అని నిలదీసింది. ఇంతటి తీవ్రమైన ఘటనకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయకపోగా, కేవలం డీఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేసు దర్యాప్తు పురోగతిపై పూర్తిస్థాయి నివేదికను వెంటనే సమర్పించాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. దర్యాప్తులో పారదర్శకత లోపించరాదని, వేగంగా పూర్తి చేసి బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలని సూచించింది. అనంతరం, తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: