Heavyrains in Telugu states: దంచికొడుతున్న వర్షం

Read Time:  1 min
Heavyrains in Telugu states: దంచికొడుతున్న వర్షం
FONT SIZE
GET APP
Heavyrains in Telugu states
Heavyrains in Telugu states

Heavyrains in Telugu states: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత రెండు రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షాలు ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ, భారీ వర్షాల హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు.

Read also: TG Weather: తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో వర్ష భీభత్సం

తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉదయం నుండి భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు, రాజధాని హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో నగరం చీకటిమయమైంది.

  • హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ఐటీ కారిడార్లలో జల్లులు కురుస్తున్నాయి.
  • ఆర్సీ పురం, పటాన్‌చెరు, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం నమోదైంది. ఆకస్మిక వానతో వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు.

ఏపీలోనూ కొనసాగుతున్న వానలు

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలపై అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి చల్లని వాతావరణం నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.