📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Today News : Heavy Rains – వరద పరిస్థితులపై నిరంతర సమీక్ష – మంత్రి శ్రీనివాస రెడ్డి

Author Icon By Shravan
Updated: August 29, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ Heavy Rains : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరద పరిస్థితులు, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షి స్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, హౌసింగ్, సమా చార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి (Minister Ponguleti) ఆదిలాబాద్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొద్ది సమయంలోనే ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కనీవినీ ఎరుగని రీతిలో వర్షపాతం నమోదైందన్నారు. అయినా కూడా ప్రాణ నష్టం, ఆస్తినష్టం వీలైనంత మేరకు తగ్గించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు బుధవారం మధ్యహ్నం నుంచే పరిస్థితిని సమీక్షించామని వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్నవారికి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. సిరిసిల్ల జిల్లాలోని నర్మల గ్రామం వద్ద బుధవారం మానేరు వాగు వరదల్లో చిక్కుకున్న ఐదుగురిని హెలికాప్టర్ ద్వారా తరలించామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వారం రోజుల క్రితమే కోటి రూపాయిల చొప్పున నిధులు విడుదల చేశామని, ప్రస్తుతం అతి భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న జిల్లాలకు అదనంగా ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని తెలిపారు. భారీ వర్షాలతో స్థంభించిన జాతీయ రహదారితోపాటు పంచాయితీరాజ్, ఆర్అండ్ బి రోడ్లను క్లియర్ చేశామని, దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా పునరుద్ధరి స్తున్నామని తెలిపారు.

పలు మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు రహదారి సౌకర్యాలు దెబ్బతిన్నాయని వీటిని వెంటనే పునరుద్దరించేలా ఆదేశించామన్నారు. జిల్లాల్లో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చిత్తశుద్దితో 24గంటలు పనిచేస్తున్నాయని తెలిపారు. గురువారం విపత్తుల నిర్వహణా శాఖ అధికారులతో మంత్రి సమీక్షించడంతో పాటు మెదక్ కామారెడ్డి సిరిసిల్ల నిర్మల్ జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ మాట్లాడారు. వర్షాలు వరదలపై ఆయా జిల్లాల యంత్రాంగంతో నిరంతరం మానిటరింగ్ చేసుకోవాలని సూచించారు.

తెలంగాణలో వర్ష బీభత్సం: నష్టానికి అంచనా, బాధితులకు సహాయం

వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత కలిగించిందని నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్షాలతో చనిపోయిన వారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో వర్ష బీభత్సం దృష్ట్యా ఎన్డీఆర్ఎఫ్. ఎస్ఆర్ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయని. అవసరాన్ని బట్టి హెలికాప్టర్ల ద్వారా బాధితులను ఆదుకోవడానికి సిద్ధం చేశామని వివరించారు. కూలి పోయిన ఇండ్లు, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి ప్రకటించారు. ఒక్క మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కేవలం ఒక గంట వ్యవధిలో 700 మిల్లీమీటర్ల వర్షం (Millimeters of rain) కారణంగా నీటి వనరులు పూర్తిగా నిండిపోయాయని, వాటని నుంచి ఉధృతంగా నీరు బయటకు వెళ్లడంతో గట్లు దెబ్బతిని తీవ్ర నష్టాన్ని వివరించారు.

Heavy Rains – వరద పరిస్థితులపై నిరంతర సమీక్ష – మంత్రి శ్రీనివాస రెడ్డి

మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని తండాలు మరీ ఎక్కువగా వర్ష బీభత్సానికి గురయ్యాయని, ఈ తండాలకు తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను వీలైనంత త్వరగా కల్పించేలా అధికారులను ఆదేశించామన్నారు. వర్షాల తర్వాత వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ఆ దిశగా చర్యలు తీసుకోవాలని.. ఆరోగ్యశాఖకు సూచించామన్నారు. రాష్ట్రంలో ప్రజలను ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్షమైన బిఆర్ఎస్ రాజకీయ లబ్దికోసం మాట్లాడడం సరికాదన్నారు. వారి పాలనలో వరదలొస్తే నాడు ఏం చేశారో నేడు ఏం జరుగుతుందో కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అన్నారు. శవాల మీద చిల్లర ఏరుకునే వ్యవహారం చేయవద్దని, ఉపయుక్తమైన సలహాలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/janasena-legislative-party-meeting-pawan-kalyans-focus-on-alliance-unity-and-development/andhra-pradesh/537463/

Breaking News in Telugu Disaster Management Telangana Flood situation updates heavy rains Telangana Latest News in Telugu Minister Srinivas Reddy news Telangana flood review Telangana Rains 2025 Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.