హైదరాబాద్లో (Hyderabad) మంగళవారం అర్ధరాత్రి వర్షం (Rain) బీభత్సంగా కురిసింది. నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, మాదాపూర్, సికింద్రాబాద్, సైదాబాద్, చంచల్ గూడ తదితర ప్రాంతాల్లో వర్షం అల్లకల్లోలం సృష్టించింది. రాత్రంతా వర్షం ఆగకుండా కురవడంతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. క్షణికంగా తుడిచిన వాన కాకుండా ఈసారి మడమ తిప్పని వర్షం నగర వాసులను అస్తవ్యస్తం చేసింది.
ట్రాఫిక్ జామ్
వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. కొన్నిచోట్ల వాహనదారులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. రహదారులపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్‌కి కారణమైంది. ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు తెల్లవారుజాము దాకా నీటిని బయటకు పంపించే ప్రయత్నాల్లో ఉండాల్సి వచ్చింది.
రెండు మూడు గంటలపాటు వర్షం
ఇవాళ కూడా హైదరాబాద్పై మేఘాలు దట్టంగా అలుముకోవడంతో వర్షం మరోసారి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో రెండు మూడు గంటలపాటు వర్షం కురిసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వానకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also : Volcano Erupts : జపాన్లో పేలిన అగ్నిపర్వతం!