📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Rain : హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం..ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం

Author Icon By Sudheer
Updated: April 18, 2025 • 8:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ నగరాన్ని ఈరోజు (ఏప్రిల్ 18) భారీ వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడం ప్రారంభమైంది. ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోఠి, అబిడ్స్, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా కరెంట్ సరఫరా కూడా నిలిచిపోయింది.

భారీ వర్షం దెబ్బకు గంటల పాటు ట్రాఫిక్‌

మియాపూర్, గచ్చిబౌలి, బహదూర్‌పల్లి, దుండిగల్, కార్వాన్, మెహదీపట్నం, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుండడంతో వాహనదారులు గంటల పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. గాంధీ భవన్ ప్రాంతంలో భారీ చెట్టు నేలకూలడంతో రహదారి పూర్తిగా ఆపబడింది. వర్షం తీవ్రతకు ప్రజలు తడిసి ముద్దవుతుండగా, వాతావరణ కేంద్రం మరో గంట పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది.

పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు

పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం, బండ్లగూడలో 8 సెం.మీ., బహదూర్‌పురలో 7.8 సెం.మీ., నాంపల్లిలో 7 సెం.మీ., చార్మినార్‌లో 6.6 సెం.మీ., అంబర్‌పేటలో 5 సెం.మీ., ఖైరతాబాద్‌లో 4.4 సెం.మీ. వర్షపాతం నమోదయ్యాయి. నగరవ్యాప్తంగా వర్షం తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయం, రోడ్లపై నీటి నిల్వలు లాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Google News in Telugu hyderabad Rain

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.