తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఇపుడు గణనీయంగా ఉధృతంగా మారుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) ప్రకారం, వచ్చే 12 గంటలలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red alert) ప్రకటించారు. స్థానిక అధికారులు, అత్యవసర సిబ్బందిని తక్షణమే సన్నద్ధం అయ్యేలా సూచించారు.
Telangana: గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీళ్లు
భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
రెడ్ అలర్ట్‌తో పాటు.. కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (Department of Meteorology) హెచ్చరించింది.
గ్రామీణ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని
రాబోయే గంటల్లో గాలివానలు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున రైతులు, గ్రామీణ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రవాహాలు పెరగడంతో తక్కువ ఎత్తున్న ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అవసరమైతే అధికారులు రక్షణ చర్యలు చేపట్టేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.హైదరాబాద్ (Hyderabad) సహా అనేక పట్టణాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమవడంతో ట్రాఫిక్ అంతరాయం, డ్రైనేజ్ సమస్యలు తలెత్తుతున్నాయి.
విద్యుత్ అంతరాయాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విద్యుత్ శాఖ (Electricity Department) ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా పంట కోత సీజన్‌లో ఉండటంతో రైతులు తడిసి పోయే ధాన్యం, పత్తి వంటివి సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవాలని అధికారులు సూచించారు. పౌరులు వర్ష సమయంలో బయటకు వెళ్లకుండా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణించాలని,
పిడుగులు పడే అవకాశం ఉన్నందున
స్థానిక అధికారుల సూచనలు పాటించాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.వ్యవసాయ పనులు చేసే కూలీలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని.. పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రెండు మూడు రోజులు వ్యవసాయ పనులను వాయిదా వేసుకుంటేనే సురక్షితం అని వాతావరణ శాఖ అధికారులే పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడం ఉత్తమం అని.. చెరువులు, వాగులు, కుంటల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: