📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Mulugu: ములుగు జిల్లాలో దంచికొట్టిన వాన

Author Icon By Sharanya
Updated: August 19, 2025 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాల్వపెల్లి వాగులో మహిళ గల్లంతు

అత్యధికంగా 182.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

ములుగు జిల్లా: ఆకాశానికి చిల్లుపడిండా అనే విధంగా ములుగు (Mulugu) జిల్లాలోని మంగపేట, ఏటూరునాగారం మండలావర్షం కురిసింది. క్లౌడ్ బరస్ట్ జరిగిందా అనే విధంగా సోమవారం తెల్లవారుజాము నుండి వర్షం దంచికొట్టింది. దీంతో రహదారులు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోవిందరావుపేట, వెంకటాపూర్ ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం, మంగపేట, తాడ్వాయి మండలాల పరిధిలో కురిసిన అతి భారీ వర్షాలకు (Heavy rains) ఏజెన్సీ ప్రాంతంలోని లోతట్టు వంతెనల పై నుండి ప్రమాదకరంగా వరద ఉదృతి ప్రవహించింది.

Mulugu

కాల్వ పెల్లి వాగులో మహిళ గల్లంతు..

మృతితాద్వాయి మండలం కాల్వపెల్లి గ్రామ తుమ్మల వాగులో సారమ్మ (48) అనే మహిళా ఆదివారం రాత్రి గల్లంతై మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మహిళ బహుర్భూమికి వెల్లిందని సమాచారం. భారీ వర్షానికి ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకుపోయిందని గ్రామస్తులు తెలిపారు. తనతల్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో కూతురు గ్రామస్తులకు ఈవిషయాన్ని తెలిపింది. అప్పటికే చీకటిపడింది. మరుసటిరోజైన సోమవారం గ్రామస్తులు ఊరి వెనుక ఉన్న వాగువెంబడి వెతకసాగారు కొద్దిదూరంలొ వాగులో మృతదేహం చెట్టుకు చిక్కుకుని కనిపించింది. ఈవిషయాన్ని పోలీసులకు తెలిపారు. మృతదేహన్ని ఇంటికి తరలించారు. మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధికారులు, పోలీసులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి వాగులు, చెరువుల వద్దకి ప్రజలు వెళ్లొద్దని హెచ్చరికలు చేసారు.

మంగపేట మండలంలో అత్యధికంగా 182.8 వర్షపాతం నమోదు…

మంగపేట మండలంలో అత్యధికంగా 182.8 మిల్లీమీటర్ల వర్షపాతం (highest rainfall was 182.8 millimeters) నమోదయ్యింది. ఈ ఆకస్మిక వర్షం కారణంగా వచ్చిన వరదల కారణంగా మంగపేట మండల కేంద్రంలోని పలు నివాస గృహాలు జలమయమయ్యాయి. కమలాపురం గ్రామంలో ఉన్న ముంపు ప్రాంతాలలో ఉన్న 15 కుటుంబాలకు చెందిన 60 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నరసింహసాగర్ గ్రామంలో ఎనిమిది కుటుంబాలకు చెందిన 40 మంది వ్యక్తులను గ్రామపంచాయతీ నరసింహసాగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిపునరావస కేంద్రానికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే మంత్రి సీతక్క ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శించారు. ఇదే క్రమంలో 25 అడుగుల నీటి సామర్ధం కలిగిన గుండ్ల వాగు ప్రాజెక్ట్ మత్తడి పోస్తుంది. గత 20 రోజుల క్రితం గంగారం, కొత్తగూడెం మండలాలలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో గుండ్ల ప్రాజెక్టులోకి భారీగా వరద రావడంతో మత్తడి పడింది. 163 జాతీయ రహదారి గుండ్ల బ్రిడ్జి, కర్లపల్లి, లక్ష్మీ పురం, నేతాజీ నగర్, టప్పమంది, ప్రాజెక్ట్ నగర్ గ్రామాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులు, మేకలు, వాగులు పొంగిపాలుతున్నందున కాపలదారులు జాగ్రత్తగా ఉండాలని వాగులు దాటవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వెంకటాపూర్ మండలంలోని ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయం సమీపంలో ఉన్న రామప్ప చెరువులో నీటి మట్టం 31 ఆడుగులకు చేరింది. మారేడుకొండ చెరు వు మత్తడి పోస్తుంది. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సీతక్క అధికారులతో సమీక్షి చారు. 24 గంటలు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/protest-mahadharna-demanding-resolution-of-teachers-problems/telangana/532729/

Breaking News Disaster Relief Floods Heavy Rain mulugu Mulugu news Telangana Telangana Weather Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.