📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

TG High court : హెచ్‌సీయూ భూములపై విచారణ రేపటికి వాయిదా

Author Icon By sumalatha chinthakayala
Updated: April 2, 2025 • 7:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG High court : తెలంగాణ హైకోర్టులో కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది. రేపటి వరకు హెచ్‌సీయూ భూముల్లో చెట్లు కొట్టివేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు అటవీ భూములను తెలంగాణ ఇండ్రస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీఐఐసీ)కి బదిలీ చేసి, చదును చేయడాన్ని వెంటనే ఆపాలని హైకోర్టులో హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె.బాబురావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

హింసాత్మక అటవీ నిర్మూలనను ఆపాలి

సర్వే నంబర్‌ 25లోని కంచ గచ్చిబౌలి అడవిలో 30–40 జేసీబీలతో సర్కార్‌ చెట్లను తొలగిస్తోంది. హింసాత్మక అటవీ నిర్మూలనను ఆపాలి అని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు..ప్రభుత్వం ఆ 400 ఎకరాలను చదును చేస్తున్న నేపథ్యంలో అత్యవసర విచారణ చేపట్టాలని తొలి పిల్‌ దాఖలు చేసిన వటా ఫౌండేషన్‌ (ఈఎన్‌పీవో) తరఫు న్యాయవాది ఒమర్‌ ఫారుక్‌.. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు విజ్ఞప్తి చేశారు. మధ్యంతర అప్లికేషన్‌ దాఖలు చేశారు. అభ్యర్థనను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్, జస్టిస్‌ రేణుక యారా ధర్మాసనంరెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై బుధవారం విచారణ చేపట్టింది.

కంచ గచ్చిబౌలి భూములపై నిజనిర్ధారణ

ఇరుణ పక్షాల వాదనలు విన్న కోర్టు కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు కొట్టివేయొద్దని ప్రభుత్వానికి సూచించింది. అదే సమయంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కంచ గచ్చిబౌలి భూములపై నిజనిర్ధారణ నివేదిక పంపాలని తెలంగాణ అటవీశాఖ అధికారులకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం కోరింది. కోర్టు తీర్పులకు లోబడే ముందుకు వెళ్లాలని సూచించింది. అటవీ చట్టానికి లోబడి చర్యలు తీసుకోవాలని తెలిపింది. నిజ నిర్ధారణ నివేదికతో పాటు సంబంధిత శాఖ తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

Breaking News in Telugu Google news Google News in Telugu HCU lands hearing Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today TG High court Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.