📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Supreme Court: నేడు సుప్రీంకోర్టులో BRS MLAల ఫిరాయింపు కేసు విచారణ

Author Icon By Aanusha
Updated: November 17, 2025 • 9:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత అంశం మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టు (Supreme Court) లో ఇందుకు సంబంధించిన పిటిషన్లపై విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ పూర్తి చేయడానికి అసెంబ్లీ స్పీకర్‌కు అక్టోబర్‌ 31 వరకు సర్వోన్నత న్యాయస్థానం గడువు విధించిన విషయం తెలిసిందే.

Read Also: TG cold alert: తెలంగాణలో తీవ్ర చలి హెచ్చరిక

కేటీఆర్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు

అయితే ఆ గడువు ముగియడంతో, మరో 8 వారాల సమయం కావాలని స్పీకర్‌ కార్యాలయం కోర్టును అభ్యర్థించింది.అసెంబ్లీ కార్యక్రమాలు, అంతర్జాతీయ సదస్సులు, విదేశీ పర్యటనల కారణంగా స్పీకర్‌ బిజీగా ఉన్నారని, అందుకే విచారణ పూర్తి చేయలేకపోయారని స్పీకర్ కార్యాలయం తన అభ్యర్థనలో పేర్కొంది.

అయితే, స్పీకర్‌ ఉద్దేశపూర్వకంగానే విచారణలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మరో పిటిషన్‌ వేశారు.ఈ పిటిషన్లన్నింటినీ కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌, జస్టిస్‌ అంజారియాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించనుంది.

ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్‌, కడియం శ్రీహరి వంటి వారిని స్పీకర్‌ ఇంతవరకు విచారించలేదన్న అంశాన్ని బీఆర్‌ఎస్‌ ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ నెల 24న సీజేఐ జస్టిస్‌ గవాయి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ కేసుపై ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారా? లేక మరో ధర్మాసనానికి బదిలీ చేస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

BRS MLAs disqualification case latest news Speaker extension request Supreme Court hearing Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.