📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Health : ప్రజల ఆరోగ్యానికి కేంద్రం పెద్దపీట – మంత్రి కిషన్ రెడ్డి

Author Icon By Shravan
Updated: August 11, 2025 • 3:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (తార్నాక) : కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి (People’s health) పెద్దపీట వేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఉప్పల్ లోని ఇండస్ట్రియల్ ప్రాంతంలో ప్రధాన మంత్రి భారతీయ జనౌషది పరియోజన తెలంగాణ మార్కెటింగ్ కండిస్ట్రిబ్యూషన్ వేర్ హౌజ్ను లార్విన్ ఫార్మా అండ్ సర్జికల్స్ సంస్థ సహకారంతో ఉప్పల్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పీఎంబీజేపిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఎంపీ ఇటల రాజేందర్ కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఆయు ష్మాన్ భారత్ విషయంలో గత ప్రభుత్వం నిరక్ష్యం చేసి వెళ్లి పోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభు త్వం అయినా ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని జనౌ షధ కేంద్రాలకు మెడికల్ డిపోగా ఉప్పల్లో ప్రధాన మంత్రి భారతీయ జనౌ షధ పరియోజన తెలం గాణ మార్కెటింగ్ కమ్ డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌసు ఏర్పాటు చేసు కున్నామని తెలి పారు. మోడీ ప్రభుత్వం 70 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, ఆస్తితో, పెన్షన్తో సంబంధం లేకుండా రూ. 5 లక్షల వరకు ఏ రాష్ట్రంలోనైనా, ఏ నగరంలోనైనా కోరుకున్న హాస్పిటల్లో వైద్యం చేయించుకునేవిధంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశ పెట్టిందని కిషన్రెడ్డి చెప్పారు. మార్కెట్లో ఉన్న మెడిసిన్ ధరలతో పోల్చితే జనౌషధ కేంద్రాలలో 50 శాతం నుంచి 90 శాతం వరకు తక్కువ ధర ఉంటుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆయుష్మాన్ భవను ప్రతి పేద వాడికి అందేలా చూడాలని డిమాండ్ చేశారు.

గవర్నర్ జిష్ణుదేవవర్మ మాట్లాడుతూ.. నాణ్యమైన ఆరోగ్య సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తేవాలనే మన లక్ష్యాన్ని మరింత ముందుకు తీసు కెళ్లే దిశగా, పిఎంబిఐ-లార్వెన్ జనఔషధి డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ వేర్హౌస్ను మీతో కలిసి ప్రారంభించుకోవడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. ప్రధానమంత్రి భారతీయ జనఔషధి పరియోజన మన ప్రభుత్వంలోని అత్యంత ప్రభావవంతమైన ప్రజా ఆరోగ్య కార్యక్రమాలలో ఒకటి నాణ్యమైన జనరిక్ మందులను తక్కువ ధరకే అందించడం జరుగుతుందన్నారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమైన రోజు అన్నారు. ఉప్పల్ లో ఈ ఆధునిక వేర్హౌస్ ప్రారంభంతో రాష్ట్రం లోని ప్రతి మూలకూ తక్కువ ధరలో మందులు వేగంగా, సమర్థవంతంగా చేరేలా చేసే బలమైన సరఫరా వ్యవస్థను ఏర్పరుస్తున్నామని చెప్పారు. జనఔషధి మందుల పంపిణీ బాధ్యతను తెలం గాణలో ముందుకు తీసుకెళ్తున్న యువ, చురుకైన పారిశ్రామికవేత్త వరుణ్ విహార్ మడుపడుగ, లార్వెన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ (Managing Director) అలాగే రాము మడుపడుగ, లార్వెన్ గ్రూప్ సిఇఒకు హృదయ పూర్వక అభినందలను అన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి చేస్తున్న కృషిని కూడా నేను అభినందిస్తున్నానని చెప్పారు.
ఈ సదుపాయం సుమారు 3,000 ముఖ్యమైన మందులు శస్త్రచికిత్సా వస్తువుల సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని పేర్కోన్నారు. తక్కువ ధరలో మందులు అందుకోవడం ప్రత్యేక హక్కు కాదు, అది ప్రతి ఒక్కరి హక్కు అని అన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/agriculture-vegetable-cultivation-in-anganwadi-centers/telangana/528918/

Breaking News in Telugu Google news government initiatives health healthcare programs Kishan Reddy public health Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.