అర‌చేతిలో స్వ‌ర్గం చూపించి గెలిచారు : కేటీఆర్‌

Read Time:  1 min
He won by showing heaven in the palm of his hand.. KTR
He won by showing heaven in the palm of his hand.. KTR
FONT SIZE
GET APP

ప్ర‌పంచానికి అన్నం పెట్టే అన్న‌దాత‌

హైదరాబాద్‌ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీగ‌ల్ల మోస‌గాడు అని సెటైర్లు వేశారు. ఆమ‌న్‌గ‌ల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు దీక్ష‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌పంచానికి అన్నం పెట్టే అన్న‌దాత‌కు కులం, మతం ఉండ‌దు. అన్ని వ‌ర్గాల్లో రైతులు ఉంట‌రు. 70 ల‌క్ష‌ల మంది రైతుల‌ను కేసీఆర్ క‌డుపులో పెట్టుకుని చూసుకున్న‌డు. ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం మాట ఇవ్వ‌క‌పోయినా.. 12 సీజ‌న్ల‌లో రూ. 73 వేల కోట్ల రైతుబంధు వేశాడు.

అధికారంలోకి రావాల‌ని అర‌చేతిలో స్వ‌ర్గం చూపించి

రైతు చ‌నిపోతే ఆ కుటుంబం ఆగం కావొద్ద‌ని చెప్పి.. తొలిసారి స్వ‌తంత్ర భార‌త‌దేశ చ‌రిత్ర‌లో రూ. 5 ల‌క్ష‌ల బీమా ప్ర‌వేశ‌పెట్టిన నాయ‌కుడు కేసీఆర్. ఆడ‌బిడ్డ లగ్గానికి ల‌క్ష రూపాయాలు క‌ల్యాణ‌ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ కింద‌ కానుక‌గా అందించారు. 200 ఉన్న పెన్ష‌న్‌ను 2 వేలు చేసిండు. ఇవ‌న్నీ చూసి జీర్ణించుకోలేక‌.. నంగ‌నాచి, దొంగ, మోస‌పు మాట‌లు చెప్పి అధికారంలోకి రావాల‌ని అర‌చేతిలో స్వ‌ర్గం చూపించి గెలిచారు అని కేటీఆర్ అన్నారు.

ఇన్ని తిట్లు తిన్న సీఎంను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు

రేవంత్ రెడ్డి నిజాయితీగ‌ల్ల మోస‌గాడు.. ప్ర‌జ‌లు మోస పోవాల‌ని కోరుకుంటారు.. మోస‌గాళ్ల‌ను న‌మ్ముత‌రు.. అందుకే మోసం చేస్తున్నాన‌ని అన్న‌డు. ఇక తెలుగు భాష‌లో ఇన్ని తిట్లు ఉంటాయ‌ను కోలేదు. కొంద‌రు తిట్లను చూస్తే రోషం ఉన్నోడు అయితే పాడుబాడ్డ బావిలో దుంకి చ‌నిపోతేడు. సిగ్గు ల‌జ్జ లేని బ‌తుకు కాబ‌ట్టి బ‌తుకుతుండు రేవంత్ రెడ్డి. ఇన్ని తిట్లు తిన్న సీఎంను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.