📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HCA Scams : హెచ్సిఎ అక్రమాలపై సిఐడికి ఆగని ఫిర్యాదులు

Author Icon By Shravan
Updated: August 11, 2025 • 12:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (HCA Scams) : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Cricket Association) అక్రమాలపై సిఐడికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనేవుంది. గత ఐపిఎల్ సీజన్లో హైదరాబాద్ సన్రైజర్స్ యాజమాన్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు గొడవలు పెట్టు కుంది మొదలుకుని వరుసగా హెచ్సిఎకు షాకులు తగులుతుండడం తెలిసిందే. హెచ్సిఎ అక్రమా లపై ఇంతకు ముందే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరిపి భారీగా అక్రమాలు జరిగి నట్లు నిర్దారించగా దీని తరువాత ఈ వ్యవహా రాలపై సిఐడి విచారణకు సర్కారు ఆదేశించడం విదితమే. ఈ క్రమంలో నెల రోజుల క్రితం హెచ్సిఎ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా ఐదుగురు కార్యవర్గ సభ్యులను సిఐడి అరెస్టు చేసింది. ఈ కేసు ఇంకా విచారణలో వుంది. కాగా తాజాగా హెచ్సిఎలో ఉపాధ్యక్షుడుగా వున్న దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీగా వున్న బసవ రాజుపై హెచ్సిఎ మాజీ కోశా ధికారి చిట్టి శ్రీధర్ సిఐడికి ఫిర్యాదు చేశారు. వీరిద్దరు మల్టీపుల్ క్లబ్ ఓనర్షిప్ ప్రయో జనాలతో హెచ్సిఎ ఎన్నికల్లో గెలుపొందారని చిట్టి శ్రీధర్ తనఫిర్యాదులో తెలిపారు. సిఐడితోపాటు హెచ్సిఎను ప్రస్తుతం పర్యవేక్షి స్తున్న అంబుడ్స్మన్కు కూడా ఆయన ఫిర్యాదు చేశారు. 2022 వరకు కమర్షియల్ ట్యాక్సెస్ క్రికెట్ (CRICKET) క్లబ్కు బసవరాజు ప్రాతినిథ్యం వహించారని శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీవిరమణ తరువాత బసవరా జు దల్టీత్సింగ్ కుటుంబానికి చెందిన అమీర్పేట్ క్రికెట్ క్లబ్ ఉపాధ్యక్షుడుగా 2023లో బాధ్యతలు చేబట్టారని ఆయన తెలిపారు.

అయితే దల్టీత్ సింగ్ కుటుంబం ఆధ్వర్యంలో అమీర్పేట్ క్రికెట్ క్లబ్, ఖాల్సా క్లబ్లు నడుస్తున్నాయని శ్రీధర్ తెలిపారు. గతంలో మల్టిపుల్ క్లబ్ ఓనర్ షిప్ ప్రయోజనాల కారణంగా 57 క్లబ్లపై జస్టిస్ లావు నాగేశ్వరరావు వేటు వేశారని, ఇదే నిబంధనల ప్రకారం దల్జీత్సింగ్ కుటుంబానికి చెందిన క్లబ్లపైనా వేటువేయాలని శ్రీధర్ కోరారు. ఈ రెండు క్లబ్ల నుంచి హెచ్సిఎ ఉపా ధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ పోస్టులను దల్టీత్ సింగ్, బసవ రాజులు దక్కించుకున్నారని ఆయన ఆరోపించారు. అక్రమంగా ఎన్నికైన హెచ్సిఎ కార్యవర్గాన్ని రద్దుచేసి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. హెచ్సిఎ అంబుడ్స్ మెన్కు అందిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధి కారులు శ్రీధర్ నుంచి వివరాలు సేకరించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/entrepreneurs-the-goal-is-to-make-women-entrepreneurs-minister-narayana/andhra-pradesh/528730/

Breaking News in Telugu CID Complaints CID investigation Hyderabad Cricket Association Latest News in Telugu Sports Corruption Telangana news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.