📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

రైతులకు హరీశ్‌రావు విజ్ఞప్తి

Author Icon By Sudheer
Updated: January 19, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆదిలాబాద్‌ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు స్పందిస్తూ.. రుణభారం, బ్యాంకుల వేధింపులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీశ్‌రావు అన్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం లాభసాటిగా మారిందని, కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి మరింత దిగజారిందని విమర్శించారు. రుణమాఫీ మభ్యపెట్టి, హామీలను అమలు చేయకపోవడం వల్లే రైతులు ఈ స్థితిలోకి వచ్చారని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఇప్పటి వరకు 402 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం దుర్మార్గమని హరీశ్‌రావు అన్నారు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం మౌనంగా ఉండడం దారుణమని మండిపడ్డారు. రైతులు రుణమాఫీ కోసం కలెక్టరేట్‌లు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తమ జీవితాలను కష్టాల్లో నెట్టుకుంటున్నారని చెప్పారు. ఈ దుస్థితి కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

ఈ సందర్బంగా రైతులెవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని, బీఆర్‌ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎన్నికల హామీలను అమలు చేయాలని, రుణమాఫీ, బోనస్ వంటి వాగ్దానాలను మర్చిపోవద్దని ఆయన హెచ్చరించారు.

Farmers farmers suicides Google news harish rao

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.