ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ విడుదల చేశారు.
- శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది!
- సిద్దిపేట అభివృద్ధిపై కక్షగట్టి రూ. 1070 కోట్ల పనులు రద్దు చేశారు..
- బీఆర్ఎస్ కట్టిన భవనాలకు రిబ్బన్ కటింగ్.. శ్రమ మాది, శిలాఫలకం రేవంత్ రెడ్డిది.
- సిద్దిపేట అభివృద్ధిపై రాజకీయ కక్ష.. ఏకంగా రూ. 1070 కోట్ల అభివృద్ధి పనుల రద్దు.
- పనులు మొదలైన సిద్దిపేట వెటర్నరీ కాలేజీని సొంత నియోజకవర్గం కొడంగల్‌కు ఎత్తుకుపోయిన ముఖ్యమంత్రి.
- కేసీఆర్ తెచ్చిన కాళేశ్వరం జలాలతోనే.. ఇవాళ రూ. 300 కోట్ల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం.
- దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రైతులకి ధోకా.. సిద్దిపేటలో 52 శాతం (22,819) మందికి అందని రుణమాఫీ.
- సీఎం పర్యటిస్తున్న నర్మెట్ట గ్రామంలోనే రుణమాఫీ కాని రైతులు 350 మంది.
- ఎగ్గొట్టిన మూడు సీజన్ల రైతుబంధు, ఏప్రిల్ వడగండ్ల నష్టపరిహారం తక్షణమే చెల్లించాలి.
- రద్దు చేసిన రూ. 1070 కోట్ల పనులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ.
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనను, సిద్దిపేట పై కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు తీరును తీవ్రంగా ఎండగడుతూ ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.
Read Also : Moinabad Drugs Case: డ్రగ్స్ కేసులో సంచలనం..అభిషేక్ సింగ్ అరెస్ట్

Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్:
- ఈ రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సిద్దిపేట నియోజకవర్గానికి కొత్తగా మంజూరైన కార్యక్రమం ఒక్కటీ లేదు.
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో ప్రారంభించబోతున్న కార్యక్రమాలన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసి, నిధులు కేటాయించి, నిర్మాణాలు పూర్తి చేసినవే.
- మాదేమో శ్రమ ఫలితం.. రేవంత్ రెడ్డి గారిదేమో శిలాఫలకం.
- శిలాఫలకాల మీద నీ పేరు ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారూ.. కానీ, సిద్దిపేట ప్రజల మనోఫలకాల మీద ఉండేది మాత్రం కేసీఆర్ గారి పేరే.
- రూ. 300 కోట్లతో నర్మెట్టలో ప్రారంభించబోతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతే.
- దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ రావడానికి, రిఫైనరీ పెట్టడానికి మేమే నిర్ణయం తీసుకున్నాం.
- టీజీఐసీ ద్వారా 62 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చాం. రైతులను స్వయంగా ఒప్పించి మొక్కలు నాటించాం.
- నాడు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఎగతాళి చేసిన రేవంత్ రెడ్డి.. ఇవాళ అదే కాళేశ్వరం జలాలతో నడిచే ఫ్యాక్టరీని ప్రారంభించడం శోచనీయం.
- ఈ ఫ్యాక్టరీ కోసం కాలువ పొడిగించి 20 కోట్ల లీటర్ల సామర్థ్యం గల చెరువును నిర్మించి నీరందించింది మేమే. పక్కనే పారుతున్న కాళేశ్వరం కాలువ నీళ్లను నెత్తిన జల్లుకుని ఫ్యాక్టరీని ప్రారంభించు.
- కాళేశ్వరం, మల్లన్న సాగర్ కట్టేటప్పుడు ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేసి ఎన్ని కుట్రలు చేసినా.. మొక్కవోని దీక్షతో ప్రాజెక్టును పూర్తి చేసి ఈ నేలకు జలాలను అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది.
- ఆరోగ్య శాఖ మంత్రిగా నాడు నేను మంజూరు చేసి, నిర్మాణాలు పూర్తి చేసిన భవనాలకు ముఖ్యమంత్రి ఇవాళ రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు.
- 3.60 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోర్, రూ. 25 కోట్లతో ఆయుష్ ఆస్పత్రి, గట్ల మల్యాలలో రూ. 1.40 కోట్లతో పీహెచ్‌సీ, సిద్దిపేట పట్టణంలో అర్బన్ పీహెచ్‌సీ భవనాలు కట్టింది మేమే.
- ఎన్నికల కోడ్ వల్ల ప్రారంభానికి నోచుకోకపోయినా ఇప్పటికే సేవలందిస్తున్నాయి. సిబ్బందిని నియమించకుండానే వాటికి శిలాఫలకాలు వేసుకోవడం సిగ్గుచేటు.
- దేవాలయాలు, విద్యాలయాలతో పాటు రూ. 78 కోట్లతో, 30 ఎకరాల స్థలంలో జిల్లా జైలును నిర్మించింది కూడా మేమే.
- అమృత్ ఫేజ్-2 కింద కేంద్రం నుంచి సాధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా బీఆర్ఎస్ హయాంలో మంజూరైనవే. మేం కట్టిన భవనాలకు శిలాఫలకాలు వేసుకోవడానికే ఈ ముఖ్యమంత్రి పర్యటన.
- ఎన్నికల ముందు దేవుళ్ల మీద ఒట్లు పెట్టిన రేవంత్ రెడ్డి.. రుణమాఫీ పేరిట రైతులను దారుణంగా మోసం చేశారు.
- సిద్దిపేట నియోజకవర్గంలో ఇంకా 52 శాతం మందికి, అంటే 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రూ. 300 కోట్ల బకాయిలున్నాయి.
- సీఎం పర్యటిస్తున్న నర్మెట్ట గ్రామంలోనే 350 మంది రైతులకు మాఫీ కాలేదు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేట పర్యటనకి వస్తున్నారు.
- వరుసగా మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టారు. ఆగిన మూడు సీజన్ల రైతుబంధు బకాయిలు వెంటనే విడుదల చేయాలి.
- 2024 – 25ఏ ప్రిల్ నెలలో వడగండ్ల వానకు నష్టపోయిన సిద్దిపేట రైతులకు వెంటనే పంట నష్టపరిహారం, బీమా అందించాలి.
- ముఖ్యమంత్రి అయ్యాక సిద్దిపేట అభివృద్ధిపై కక్షగట్టి 1070 కోట్ల పనులను రేవంత్ రెడ్డి రద్దు చేశారు.
- సగం పనులైన ప్రభుత్వ వెటర్నరీ కాలేజీని ఇక్కడి నుంచి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు ఎత్తుకుపోయారు. ఇది ముఖ్యమంత్రి స్థాయికి తగిన పనేనా?
- సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్నది నేనే అని చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారా?
- రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్ట్, కోమటి చెరువుపై శిల్పారామం, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్ , అగ్రికల్చర్ కాలేజీ, మిట్టపల్లి ఎస్సీ గురుకులం, సిద్దిపేట స్పోర్ట్స్ స్టేడియం, టూ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లు, సిద్దిపేట-ఇల్లంతకుంట, సిద్దిపేట-కిష్టాపూర్ ఫోర్ లేన్ రోడ్లు, ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను అర్ధాంతరంగా ఆపేశారు.
- కేవలం రాజకీయ కక్షతో రద్దు చేసిన ఈ రూ. 1070 కోట్ల పనులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం..
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: