📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Maganti Gopinath : ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి పై హరీష్ రావు ఏమన్నారంటే..!!

Author Icon By Sudheer
Updated: June 5, 2025 • 8:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) గురువారం ఉదయం ఆకస్మికంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు లక్షణాలు కనిపించడంతో ఆయనను తక్షణమే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి(AIG Hospatal )కి తరలించారు. వైద్యులు ఆయనను అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మొదటి సమాచారం ప్రకారం మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి తీవ్రమైనదిగా భావిస్తున్నారు. ఆస్పత్రి వర్గాలు త్వరలోనే అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు.

హరీష్ రావు ఏమన్నారంటే

మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆసుపత్రికి వచ్చి, మాగంటి పరిస్థితిపై వైద్యులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. వైద్య బృందం నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు” అని తెలిపారు.

హాస్పటల్ వద్ద టెన్షన్ ..టెన్షన్

బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, మాగంటి అనుచరులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మాగంటి ఆరోగ్యంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. వైద్యుల ప్రకటన మేరకు వచ్చే సమయాల్లో మరిన్ని వివరాలు తెలియనుండగా, గోపీనాథ్ ఆరోగ్యంపై స్పష్టత కోసం అందరి దృష్టీ ఆసుపత్రి హెల్త్ బులిటెన్‌పైనే ఉంది.

Read Also : Chhattisgarh Bijapur Encounter : మావోయిస్ట్‌లకు మరో షాక్

BRS MLA maganti gopinath Google News in Telugu harish rao maganti gopinath health

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.