Harish Rao: రేవంత్ రెడ్డికి జైలు శిక్ష తప్పదు

Read Time:  1 min
Harish Rao: రేవంత్ రెడ్డికి జైలు శిక్ష తప్పదు
FONT SIZE
GET APP

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డికి జైలు శిక్ష తప్పదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) అన్నారు. మెదక్ రామదాస్ చౌరస్తా వద్ద నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోయే సమయం దగ్గర పడిందనే సాక్ష్యాలు మాయం చేసేందుకు HYDలో ఫోరెన్సిక్ ల్యాబ్ ను దగ్ధం చేశాడన్నారు. పోలీసుల సహకారంతో ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు.

హైదరాబాద్ లో పేదల బతుకులు కూల్చి, జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలను మాయం చేశాడని ఆరోపించారు. రేవంతు డైరెక్షన్ లోనే పోలీసులు ఈ దహన కాండ జరిగినదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్ల కాలంలో రాష్ట్ర ప్రజలకు చేసింది గుండు సున్నా అన్నారు. మిర్యాలగూడ, భూపాలపల్లి, నిజామాబాద్ పోయిండు ముఖ్యమంత్రి కానీ మెదక్ కు వచ్చేందుకు ముఖం లేదన్నారు.

Read Also: Ponnam Prabhakar: పట్టణం చుట్టూ రింగు రోడ్డుతో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

Harish Rao: రేవంత్ రెడ్డికి జైలు శిక్ష తప్పదు
Revanth Reddy will inevitably face a jail sentence.

ఒట్టు వేసి మాట తప్పిండు

ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మాట తప్పిండు కాబట్టి ఆయనకు రావడానికి భయం పుట్టుకుందన్నారు. రుణమాఫీ చేస్తానని మెదక్ లో ఏడుపాయల అమ్మవారి పై ఒట్టు వేసి మాట తప్పి మోసం చేసిండన్నారు. రైతు బంధు ఎగ్గొట్టి, రాష్ట్రంలో ఎరువుల కరువు (Harish Rao) రేవంత్ రెడ్డి తెచ్చడన్నారు. రేవంతు బూతులు మాట్లాడటం తప్ప ఒక్క మంచి పని చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో రంజాన్ వచ్చిందని, కానీ ముస్లిం లకు పండగ తోఫా కూడా ఇవ్వడం లేదన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం లేదని, తులం బంగారం దిక్కు లేదన్నారు. కేసీఆర్ మైనారిటీ గురుకులాలు షాదీ ఖానా ఏర్పాటు చేశారని చెప్పారు. కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని సెక్యూలర్ పార్టీగా నిలబెట్టారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెల్లవారితే కేసీఆర్, హరీశ్ రావులను తిడితే పేదల కడుపు నిండుతుందా అని ప్రశ్నించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.