📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

KCR Iftar Tradition: 35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Author Icon By Siva Prasad
Updated: March 9, 2026 • 8:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

KCR Iftar Tradition: 35 సంవత్సరాల క్రితమే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గం లోని చింతమడకలో ఇఫ్తార్ విందును ప్రారంభించారని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు . రంజాన్ మాసం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇక్బాల్ మినార్ ఈద్గా మైదానంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సిద్దిపేటలో ప్రారంభమైన ఇఫ్తార్ విందులు నేడు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేసిఆర్ పాలన కొనసాగించారని గుర్తు చేశారు.

Read Also: Sakala Janula Samme: కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోనే హజ్ హౌస్ నిర్మాణం

రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత మొట్టమొదటి హజ్ హౌస్ నిర్మాణం సిద్ధిపేట లోనే జరిగిందన్నారు. సిద్దిపేట అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గతంలో రంజాన్ పండుగ వచ్చిందంటే సదుపాయాల కోసం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగేదని అదే కెసిఆర్ సీఎం అయ్యాక సమావేశాలు నిర్వహించక ముందే పూర్తిస్థాయి సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఆఖరి సఫర్ అనే అంతిమా యాత్ర వాహనాన్ని సిద్దిపేట లోనే ప్రారంభించుకున్నామన్నారు.

KCR Iftar Tradition: సొంత నిధులతో నిరుపేదలకు ఉమ్రయాత్ర

ప్రతి సంవత్సరం తన సొంత డబ్బులతో పదిమంది నిరుపేద ముస్లింలకు ఉమ్రా యాత్రకు పంపిస్తున్నానన్నారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ముస్లిం మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి కెసిఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసి నమాజుతోపాటు ఇంగ్లీష్ మీడియం లో విద్య బోధన అందించిందన్నారు.

నిరుపేదల కోసం రంజాన్ తోఫా మరియు డబుల్ బెడ్రూం ఇళ్లు

రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహించింది కేసీఆరేనని అన్నారు. నిరుపేదలు సైతం సంతోషంగా పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రంజాన్ తోపను అందించామన్నారు. సిద్దిపేట 700మంది డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చామన్నారు..నిరంతరం ప్రజా సేవే తన ముఖ్య లక్ష్యమన్నారు. మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మస్కటి అధినేత మస్కటి అలీలు మాట్లాడుతూ హరీష్ రావు సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిపారన్నారు. ఇక్కడి ప్రజలు అన్నదమ్ముల కలిసిమెలిసి ఉంటారన్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BRS Minority Welfare Chintamadaka Iftar History Harish Rao Siddipet Harish Rao Umrah Yatra KCR Iftar Tradition Siddipet Haj House Telangana Iftar News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.