📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మున్సిపాలిటీలపై బీజేపీ కన్ను ప్రేమ జంట ఆత్మహత్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి రూ.100 కోట్లకు మేయర్ సీటు’ KTRకు రేవంత్ కౌంటర్ బిఆర్ఎస్ ను యాసిడ్ పోసి కడగాలి కేసీఆర్‌పై విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు మున్సిపాలిటీలపై బీజేపీ కన్ను ప్రేమ జంట ఆత్మహత్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి రూ.100 కోట్లకు మేయర్ సీటు’ KTRకు రేవంత్ కౌంటర్ బిఆర్ఎస్ ను యాసిడ్ పోసి కడగాలి కేసీఆర్‌పై విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Harish Rao allegations : బొగ్గు స్కామ్ భయమా? హరీశ్ రావు ఆరోపణలు కలకలం!

Author Icon By Sai Kiran
Updated: January 20, 2026 • 8:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Harish Rao allegations : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దాదాపు ఏడు గంటల పాటు సాగిన విచారణ తర్వాత తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు కుంభకోణం కేసులో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది పాత్ర త్వరలో బయటపడుతుందన్న భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ విచారణ పేరుతో హడావిడి చేశారని హరీశ్ రావు ఆరోపించారు.

తాను ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తినని, ఇలాంటి విచారణలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో ఎన్నో కేసులు, అరెస్టులు ఎదుర్కొన్నానని, చట్టంపై గౌరవంతోనే నోటీసులు అందుకున్న వెంటనే విచారణకు హాజరయ్యానన్నారు. ఎన్ని సార్లు పిలిచినా విచారణకు వస్తానని, ఏది అడిగినా నిజాయితీగా సమాధానం చెబుతానని తెలిపారు. సీఎం కేసీఆర్ తమకు ధైర్యంగా బతకడం నేర్పించారని వ్యాఖ్యానించారు.

Read also: RBI: ఇకపై వెండి వస్తువులకు కూడా బ్యాంకుల్లో తాకట్టు సదుపాయం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలకు కేంద్రంగా (Harish Rao allegations) మారిందని హరీశ్ రావు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కార్ స్కామ్‌లపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి నిజంగా నిజాయితీపరుడైతే బొగ్గు కుంభకోణం కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కొనకుండా విచారణల పేరుతో ప్రతిపక్షాలను వేధిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu BRS leader Harish Rao statement coal scam controversy Congress government corruption claims Google News in Telugu Harish Rao allegations Harish Rao press meet Latest News in Telugu Phone Tapping Case Telangana Revanth Reddy brother in law issue SIT inquiry Telangana Telangana Political News Telangana politics latest Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.