📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Harish Rao: ఫేక్ వీడియోలపై డీజీపీకి హరీశ్ రావు ఫిర్యాదు

Author Icon By Saritha
Updated: February 23, 2026 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Harish Rao: బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యవస్థీకృత దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. పోలీసుల అంతు చూసేదాకా వదలబోము అంటూ తన పేరిట ఒక ఫేక్ వీడియో క్లిప్‌ను కొందరు సర్క్యులేట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తప్పుడు ప్రచారం పోలీసులకు, తనకు మధ్య దూరం పెంచేలా ఉందని ఆయన ఆరోపించారు.

Read Also: Wildlife : వన్యప్రాణులను కాపాడుకోలేమా?

Harish Rao: Harish Rao complains to DGP over fake videos

హరీశ్ రావు సోమవారం ఎక్స్ వేదికగా తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. తెలంగాణ డీజీపీ గారూ, పోలీసులను, ప్రజలను రెచ్చగొట్టి, తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా కొన్ని ఫేక్ న్యూస్ క్లిప్పులను ప్రచారంలోకి వదులుతున్నారు. ఇది నేరుగా సంస్థాగత విశ్వసనీయతపై చేస్తున్న దాడి. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుంటారా? లేదంటే ఇలాగే అడ్డుఅదుపు లేకుండా వదిలేస్తారా?” అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ డీజీపీ గారూ, పోలీసులను, ప్రజలను రెచ్చగొట్టి, తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా కొన్ని ఫేక్ న్యూస్ క్లిప్పులను ప్రచారంలోకి వదులుతున్నారు. ఇది నేరుగా సంస్థాగత విశ్వసనీయతపై చేస్తున్న దాడి. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుంటారా? లేదంటే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇలాగే అడ్డుఅదుపు లేకుండా వదిలేస్తారా? ముఖ్యమంత్రి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి కింద ఈ దుష్ప్రచారం చేస్తున్న వారికి రాజకీయ అండదండలు ఉన్నందువల్లే మీరు ఇలా ఎంపిక చేసుకుని మరీ మౌనంగా ఉంటున్నారా? పోలీసు శాఖ గురించి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Fake Video Clips Harish Rao news Harish Rao Twitter Post Latest News in Telugu Telangana DGP Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.