పోలవరం – నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టులో విచారణ అర్హత లేని పిటిషన్ వేసి, ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు.
Read also: Medak: పెద్ద శంకరంపేటలో ప్రజావాణి పాల్గొన్న జిల్లా కలెక్టర్
బలహీనమైన రిట్ వేసి తెలంగాణ నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేశారని మండిపడ్డ హరీశ్ రావు, రిట్ ఉపసంహరణ చేసి సివిల్ సూట్ వేస్తామని చెప్పడం ఏపీకి గడువు ఇవ్వడమేనని వ్యాఖ్యానించారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డి చేస్తున్న చారిత్రక ద్రోహాన్ని బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో ఎండగడుతుందని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టుల విషయంలో ముందునుంచి ఏపీకి రేవంత్ ప్రభుత్వం సహకరిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. బనకచర్ల అంశంలో అజెండాలో లేదని చెబుతూనే చర్చ జరపడం, సంతకాలు చేయబోమంటూనే ఒప్పందాలకు ఆమోదం తెలపడం, చివరకు సుప్రీంకోర్టులో బలహీనమైన పిటిషన్ దాఖలు చేయడం ద్వారా నల్లమల సాగర్‌కు మద్దతు ప్రకటించినట్లేనని విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: