Telangana politics : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి Revanth Reddy పరిపాలనలో అధికారులను బెదిరిస్తున్నారని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి Harish Rao సంచలన ఆరోపణలు చేశారు. కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి పాలన నిర్వహించే అనుభవం లేదని విమర్శించారు. ఉన్నతాధికారులను తరచూ బదిలీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యవస్థలో అయోమయం నెలకొంటోందని తెలిపారు.
రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే ఐదుసార్లు పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేశారని ఆయన పేర్కొన్నారు. అధికారులు కొత్త ప్రాంతంలో పరిస్థితులను అర్థం చేసుకునేలోపే మళ్లీ బదిలీ చేయడం జరుగుతోందని విమర్శించారు.
Read Also: Madhya Pradesh: విద్యార్థుల అరాచకం: యూనిఫాం బెల్టులతో వీధి రౌడీల్లా దాడులు!
మహానగర పాలక సంస్థ కమిషనర్లు కూడా తరచూ మారుతున్నారని హరీశ్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి లేదా మంత్రులకు నచ్చకపోతే వెంటనే అధికారులను బదిలీ చేస్తున్నారని ఆరోపించారు.
త్వరలో అధికార పార్టీకి చెందిన నాయకుల అవినీతి, బినామీ వ్యవహారాలపై పూర్తి వివరాలను బయటపెడతామని ఆయన హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: