తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రైతుబంధు, రుణమాఫీ, పంటల కొనుగోలు వంటి కీలక కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైదొలిగిందని ఆయన ఆరోపించారు. మూడు పంటలకు రైతుబంధు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు దానిని ఒక్క పంటకే పరిమితం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సోయా, మక్క రైతులకు 48 గంటల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పినా 48 రోజులు గడిచినా చెల్లింపులు జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి సన్న వడ్ల బోనస్‌కు సంబంధించిన రూ.1,150 కోట్లు కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read also: Khammam: కుమారుడి క్రికెట్ కల కోసం పొలాన్ని మైదానంగా మార్చిన తండ్రి
Harish Rao fires at Revanth Sarkar
పాదయాత్ర చేపట్టే పరిస్థితి
సంగారెడ్డిపై ప్రభుత్వం అన్యాయం చేస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల పనులను నిలిపివేయడం వల్ల ప్రాంత అభివృద్ధి ఆగిపోయిందని వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్‌లో కొత్త చెరువులకు భూసేకరణ పూర్తయినా పనులు మొదలు పెట్టకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇలాగే కొనసాగితే పాదయాత్ర చేపట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మల్లన్న జాతరల్లో పాల్గొన్న తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: