📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Hanumakonda: అన్నం పెట్టని కొడుకు.. కోట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన తండ్రి

Author Icon By Anusha
Updated: October 15, 2025 • 11:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రులు వారి సంతానం ప్రేమ, గౌరవం పొందాలని ఆశపడుతుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో, పిల్లలు ఆస్తులు సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూ తల్లిదండ్రులను వదిలేస్తారు.వృద్ధాప్యంగా వారికి ఆసరాగా ఉండాల్సింది పోయి అనాథలుగా వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు.

Read Also: Jubilee Hills by-election: ఎగ్జిట్ పోల్స్‌పై కఠిన చర్యలు!

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఓ కుమారుడు కూడా తన తండ్రిని అలాగే వదిలేశాడు. బుక్కెడు బువ్వ పెట్టకుండా అనాథను చేశాడు.వివరాల్లోకి వెళితే.. ఎల్కతుర్తికి చెందిన గోలి శ్యాంసుందర్ రెడ్డి, వసంత దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె అమెరికా (America) లో స్థిరపడగా..

కుమారుడు రంజిత్‌రెడ్డి కూడా అమెరికాలో ఉద్యోగం చేసి 2016లో స్వదేశానికి తిరిగి వచ్చాడు. తల్లి వసంత 2021లో మరణించిన తర్వాత, శ్యాంసుందర్‌రెడ్డి ఎల్కతుర్తిలోని పాత ఇంట్లోనే ఒంటరిగా జీవిస్తున్నారు. గతంలో 2006–2011 మధ్య ఆయన ఎల్కతుర్తి ఎంపీపీగా పని చేశారు. తండ్రిని చూసుకోవాల్సిన కుమారుడు రంజిత్‌రెడ్డి పట్టించుకోవడం మానేశాడు.

Hanumakonda

కుమారుడు అతడిపై దాడి చేసి

హనుమకొండ (Hanumakonda) లో ఉన్న ఇంటిని కూడా తన పేరిట రిజిస్ట్రేషన్ (Registration) చేయించుకున్నాడు. దీనిపై ప్రశ్నించగా.. కుమారుడు అతడిపై దాడి చేసి ఇంటి నుంచి గెంటేశాడు. అంతేకాక తన భార్య వసంత పేర ఉన్న మూడెకరాల భూమిని సైతం రంజిత్‌రెడ్డి (Ranjith Reddy) ‘విరాసత్ పట్టా’ చేయించుకున్నాడు.

కుమార్తెకు పసుపు కుంకుమల కింద ఇచ్చిన వ్యవసాయ భూమిని కూడా రంజిత్‌ రెడ్డి అక్రమించుకుని ఇబ్బందులు పెడుతున్నాడు.తనను ఆదరించని, కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టని కుమారుడికి తన ఆస్తి ఏ మాత్రం దక్కనివ్వకూడదని శ్యాంసుందర్‌రెడ్డి నిర్ణయించుకున్నారు.

ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని

ఈ మేరకు తన పేరిట ఉన్న 6 ఎకరాల వ్యవసాయ భూమిలో నుంచి రూ. 3 కోట్ల విలువైన 3 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని సంకల్పించారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ (Hanumakonda) కలెక్టర్ స్నేహ శబరీష్‌, ఆర్డీవో రమేశ్‌ రాథోడ్‌ను కలిసిన శ్యాంసుందర్‌రెడ్డి ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తూ వీలునామా రాసి అధికారులకు అందజేశారు.

ప్రభుత్వానికి అప్పగించిన భూమిలో తన భార్య వసంత జ్ఞాపకార్థం ప్రజలకు ఉపయోగపడే పక్కా భవనాలను నిర్మించి అంకితం చేయాలని ఆయన అధికారులను కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Breaking News Hanumakonda news latest news property donation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.