हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Hanumakonda Accident: రోడ్డు ప్రమాదం లో ముగ్గురి మృతి తో పెళ్లింట్లో విషాదం

Sushmitha
Telugu  News: Hanumakonda Accident: రోడ్డు ప్రమాదం లో ముగ్గురి మృతి తో పెళ్లింట్లో విషాదం

పెళ్లి వేడుకలతో సందడిగా ఉన్న ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హనుమకొండ(Hanumakonda) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లి బృందంలోని ముగ్గురిని బలిగొంది. మరో 12 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఎల్కతుర్తి మండలం గోపాలపురం క్రాస్‌ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై జరిగింది.

Read Also: YS Sharmila: జాతీయ విపత్తుగా గుర్తించాలి..ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిలా

ప్రమాద వివరాలు

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సూదన్‌పల్లికి చెందిన యువతికి, సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడితో ఇటీవల వివాహం జరిగింది. పెళ్లి వేడుకల్లో భాగంగా వధువు తరఫు బంధువులు వరుడి ఇంటికి వెళ్లి, కార్యక్రమాలు ముగించుకుని బొలెరో వాహనంలో(Bolero vehicle) తిరిగి మహబూబాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో గోపాలపురం క్రాస్‌ రోడ్డు వద్ద వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని ఆపారు. అదే సమయంలో, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ బోర్‌వెల్స్‌ లారీ అదుపుతప్పి బొలెరోను బలంగా ఢీకొట్టింది.

 Hanumakonda Accident

ప్రాణ నష్టం, చికిత్స

ఈ ప్రమాదం ధాటికి బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్‌లోని(Warangal) ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 12 మంది ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. పెళ్లింట జరిగిన ఈ ప్రమాదంతో ఇరు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870