📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Handloom : జాతీయ చేనేత దినోత్సవానికి ప్రభుత్వం ఏర్పాట్లు – కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు ప్రదానం

Author Icon By Shravan
Updated: August 7, 2025 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ (State Government) ఆధ్వర్యంలో గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది నేత కార్మికులు, డిజై నర్లకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత, పవర్లూమ్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి పలు కార్యక్రమాలను అమలు చేసింది. అన్ని శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలు టిజిఎస్ సిఓ ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయాలనే ఆదేశాలు జారీ చేసింది. 2025-26 లో ఇప్పటివరకు రూ.587.26 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చింది. ఇందిరా మహిళ శక్తి స్వయం సహాయక బృందాలకు ఏడాదికి రెండు సార్లు ఉచితంగా చీరల పంపిణీ. 65 లక్షల మంది మహిళలకు పంపిణీ చేసేందుకు 131 మ్యాక్స్, 56 చిన్నతరహా పరిశ్రమలలో చీరలు తయారు చేయిస్తున్నారు. రూ.50 కోట్ల కార్పస్ ఫండ్లో గత ఏడాది టిజిఎస్సీఓ నోడల్ ఏజెన్సీగా వేముల వాడలో యార్న్ డిపోను ఏర్పాటు చేసింది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ని హైదరాబాద్ లో నెలకొల్పింది. చేనేత కార్మికులకు రూ. లక్ష వరకు రుణ మాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఈ పథకానికి రూ.33 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణ చెనేత అభయహస్తం (నేతన్న పొదుపు- థ్రిఫ్ట్ ఫండ్)లో భాగంగా కార్మికులు తమ జీతం నుండి 8శాతం పొదుపు చేస్తే, ప్రభుత్వం వారి జీతానికి డబుల్ మద్దతుగా ఇస్తుంది. ఈ పథకంతో దాదాపు 36,133 మంది కార్మికులు లబ్ధి పొందుతున్నారు. పవర్లూమ్ కార్మికుల థ్రిఫ్ట్ ఫండ్ పథకంలో దాదాపు 15 వేల మంది లబ్ధిపొందుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ఈ పథకానికి రూ.30 కోట్లు కేటాయించారు. తెలంగాణ నేతన్న భద్రత పథకం కింద చనిపోయిన చేనేత, అనుబంధ కార్మికుల కుటుంబాలకు రూ. 5లక్షల ఆర్థిక సాయం అందజేస్తుంది. తెలంగాణ నేతన్నకు భరోసా పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. కార్మికులకు ప్రోత్సాహకంగా సంవ్సతరానికి రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ. 6వేలు అందిస్తుంది. ఈ ఏడాది రూ.12.20 కోట్ల పరిపాలనా అనుమతి కూడా ఇచ్చింది.

కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపికైన వారి జాబితా: కరీంనగర్- తుమ్మ రామస్వామి, కరీంనగర్- గుర్రం కొండయ్య, మంచిర్యాల-లిక్కి శంకరయ్య, వరంగల్-కంచె నర్సింగరావు, జనగాం- న్యాలపల్లి విజయ ప్రకాశ్, రాజన్న సిరిసిల్ల- ఎల్టీరేఖ, రంగారెడ్డి-గంజం శ్రీనివాస్, రంగారెడ్డి- గుర్రం చంద్రమోళి, హైదరాబాద్- కర్దాసు రమేశ్, సిద్ధిపేట-జిందం రాజేషం, సిద్దిపేట-బైరి శ్రీనివాస్, సిద్దిపేట-మంతూరి వెంకటేశం, యాదాద్రి భువనగిరి-గూడ పవన్, యాదాద్రి భువనగిరి-కొలను శంకర్, యాదాద్రి భువనగిరి- సామల భాస్కర్, యాదాద్రి భువనగిరి మంగళపల్లి శ్రీహరి, యాదాద్రి భువనగిరి-చెలిమల కృష్ణ, నల్గొండ-కర్నాటి సదుర్గు, నల్గొండ- చిలుకూరి శ్రీనివాసులు, నల్గొండ-చిట్టిపోలు ధనుంజయ, నల్గొండ- గాజుల అనిల్, నల్గొండ- గుర్రం యాదయ్య, నల్గొండ- మునగపాటి శ్రీనివాస్, నల్గొండ కర్నాటి కృష్ణయ్య, నల్గొండ-అవరి రవీంద్ర, నారా యణపేట జన్ను జన్ను ఆంజనేయులు, నారాయణపేట-యాంగల్ ఆంజనేయులు, జోగులాంబ గద్వాల్-సూర్య వెంకటేష్, జోగులాంబ గద్వాల్-లక్ష్మీ, వనవర్తి-దేవరకొండ సీతన్న, వనపర్తి- శీలబుద్దన్న, వన పర్తి-మహంకాళి సులోచన, వనపర్తి- సారంగి రాములు ఉన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/cyber-awareness-cyber-awareness-day-across-the-state-tgcacb-director-shikha-goyal/hyderabad/527395/

Breaking News in Telugu Government Schemes for Weavers Handloom Day Indian Handloom Industry Konda Laxman Bapuji Awards Latest News in Telugu Telugu News Textile Designers India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.