📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Handicrafts Exhibition: ఇందిరా మహిళాశక్తి బజార్లో హస్తకళల ప్రదర్శన ప్రారంభం

Author Icon By Saritha
Updated: March 7, 2026 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Handicrafts Exhibition: రాజధాని నగరంలోని హైటెక్ సిటీ సమీపంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి బజార్లో ఇండియా హ్యాండ్ మేడ్ కలెక్టివ్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్చ్) సంయుక్తంగా నిర్వహిస్తున్న హస్తకళల ప్రత్యేక ప్రదర్శన ప్రారంభమైంది. చేతివృత్తిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడం, హస్తకళలకు విసృత మార్కెట్ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమాన్ని సినీనటి, ఎనిమల్ రైట్స్ కార్యకర్త అమల అక్కినేని (Amala Akkineni), సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్, టెక్స్టైల్ నిపుణులు, సిసిటి వ్యవస్థాపక సభ్యురాలు విజయలక్ష్మి నార్నే, వ్యవసాయ శాస్త్రవేత్త ప్రారంభించారు. అనంతరం ఎక్స్ పీరియన్స్ సెంటర్ తోపాటు విక్రయాలతో కూడిన ప్రత్యేక ప్రదర్శనను సందర్శించారు.

Read Also: Netflix: హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్.. 12న ఆఫీస్ ఓపెనింగ్

Handicrafts Exhibition: Handicrafts exhibition begins at Indira Mahilashakti Bazaar

సంప్రదాయ కళల పరిరక్షణ మన బాధ్యత

ఈ సందర్భంగా మాట్లాడిన అమల అక్కినేని సాంప్రదాయ చేతివృత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. భారతీయ సంప్రదాయాలకు ప్రతీకలైన చేతివృత్తులు మన సంస్కృతికి అద్దం పట్టేవని, వాటి పరిరక్షణ ప్రతీ ఒక్కరిబాధ్యత అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక కుటుంబాలు తరతరాలుగా చేతివృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని, యంత్రాల ఆధిపత్యం పెరగడంతో ఈ వృత్తులు క్రమంగా క్షీణిస్తున్నాయని తెలిపారు. చేతివృత్తుల ఉత్పత్తులకు విసృత మార్కెట్ అవకాశాలు కల్పిస్తే కళాకారులకు ఆర్ధికంగా ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. యువత దేతివృత్తులవైపు ఆకర్షితులయ్యేలా శిక్షణ అవసరమని సూచించారు.

మహిళా సాధికారతకు వేదికగా ఇందిరా మహిళా శక్తి బజార్

అనంతరం సెర్చ్ సిఇఒ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇందిరా మహిళా శక్తి బజార్గా అభివృద్ధి చెందిన ఈ ప్రాంగణం ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురై వివాదాల్లో చిక్కుకుందని తెలిపారు.ఈ స్థలాన్ని వేలం వేస్తే రూ.500 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి సీతర్క మహిళల సాధికారత కోసం దీన్ని మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ స్థలాన్ని గ్రామీణ మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించుకునే కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సుమారు. రూ.9 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాలకు షాపులను ఉచితంగా కేటాయించినట్లు పేర్కొన్నారు.

కాగా… ఐహెచ్ఎంసి తెలంగాణా చాప్టర్లో చేతితో నేసిన వస్త్రాలు సహజ వర్ణాలతో తయారైన దుస్తులు, అలంకరణ వస్తువులు, సహజ ఫైబర్ కళాకృతులు, మట్టి ఆభరణాలు, లాకర్ బొమ్మలు, వంట సామగ్రి, సహజ పదార్థాలతో తయారైన చర్మ సంరక్షణ ఉత్పత్తులు, ప్రత్యేక గిఫ్ట్ కాంబినేషన్లు అందుబాటులో ఉంచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఈ బజార్ను సందర్శించనున్నట్లు నిర్వాహకులు: తెలిపారు. పెద్ద ఎత్తున మహిళా స్వయం సహాయకం సంఘాల సభ్యులు హాజరై తమ ఉత్పత్తులను ప్రదర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Amala Akkineni Handicrafts Exhibition Hyderabad Indira Mahila Shakti Bazar minister seethakka

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.