हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

తెలంగాణలో ఒంటిపూట బడులు ఎప్పుడంటే!

Anusha
తెలంగాణలో ఒంటిపూట బడులు ఎప్పుడంటే!

తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడుల నిర్వహణపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలుచోట్ల 35-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో, రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వడదెబ్బ సోకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పెరుగుతన్న ఎండల నేపథ్యంలో పిల్లలకు ఒంటి పూట నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యకమవుతుంది. పొద్దున 10 దాటగానే సూర్యుడు
దిగిపోతున్నాడు. మార్చి కూడా రాకుండానే ఎండల తీవ్రత ఓ రేంజ్‌లో పెరిగింది. బండ్లు పెట్టుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు అల్లాడిపోతున్నారు. ఇక బళ్లకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎండల్లో స్కూల్‌కు వెళ్లేందకు అవస్థలు పడుతున్నారు. వెళ్లాక కూడా ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.కాస్త ముందుగానే ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

students 1

ఎండల తీవ్రత

రాబోయే వారంతో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎండల ధాటికి ఆరోగ్య సమస్యలు తప్పవని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం, అతి త్వరలో ఒక్క పూట బడులపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఒంటి పూట బడులు

మార్చి 1 నుంచి ఒంటి పూట బడులు పెడితే, విద్యార్థులకు ఎండల తీవ్రత నుండి ఊరట లభిస్తుందని విద్యార్థి సంఘాలు సూచిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మార్చి మొదటి వారం తర్వాతే అంటే.. మార్చి 10వ తేదీ నుంచి ఒక్క పూట బడులు నిర్వహించే యోచనలో ఉన్న అనధికారికంగా తెలిసింది.

హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వడదెబ్బ సోకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగడం మానుకోవాలని, ఎక్కువ నీరు తాగాలని సూచనలు ఇస్తున్నారు.

వడదెబ్బ నివారణకు సూచనలు

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, వైద్య నిపుణులు ప్రజలకు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు:

నీటిని ఎక్కువగా తాగాలి.
బహిరంగ ప్రదేశాలకు వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వడదెబ్బ లక్షణాలు కనపడితే వెంటనే వైద్య సాయం పొందాలి.
పిల్లలు, వృద్ధులు ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండేలా చూడాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870