Rains: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వడగండ్ల వానలు!

Read Time:  1 min
Hail showers in Telugu states today and tomorrow!
Hail showers in Telugu states today and tomorrow!
FONT SIZE
GET APP

Rains : తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు పడనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల పిడుగులు పడతాయని, గంటకు 40 నుంచి 50 కి. మీ. వేగంతో గాలులూ వీయొచ్చని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు

పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ

తెలంగాణలో మరో రెండు రోజులు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో కొన్ని జిల్లాల్లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా ఆదిలాబాద్, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, కర్నూలు, కడప, చిత్తూరు వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. ఇవాళ, రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. దీంతో తల్లిదండ్రులు స్కూళ్లకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు.

ఆశ్రయం కోసం సురక్షిత ప్రదేశాలను ఎంచుకోవాలని సూచిన

కాగా, ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఐఎండీ అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. నిజామాబాద్‌, కామారెడ్డి, హైదరాబాద్‌, ఆదిలాబాద్‌ పరిసరాల్లో గంటకు 30-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. నేడు, రేపు ఆదిలాబాద్‌, వికారాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించారు. ప్రజలు బయట తిరగడం తగ్గించి, ఆశ్రయం కోసం సురక్షిత ప్రదేశాలను ఎంచుకోవాలని సూచించారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.