📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Gyanesh Kumar: ఓటర్ల జాబితా సవరణలో తెలంగాణ దేశానికే మార్గదర్శకం

Author Icon By Tejaswini Y
Updated: December 22, 2025 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana Elections: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) విషయంలో తెలంగాణ త్వరలోనే దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని అభినందనలు తెలిపారు. ఈ విషయంలో బీహార్ ఇటీవల విజయవంతంగా పూర్తయిన ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రమాణంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar) బూత్అయి అధికారులు బిఎస్ఓలను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత ఎన్నికల వ్యవస్థకు వీరే వెన్నెముకని, వారి నిబద్ధత, కృషిపైనే ఓటర్ల జాబితా సవరణ విజయం ఆధారపడి ఉంటుందని తెలిపారు.

Read Also: Bollaram: హైదరాబాద్‌లో రాజకీయ ప్రముఖులతో రాష్ట్రపతి ఎట్ హోం వేడుక

బీహార్‌లో 7.5 కోట్ల మంది ఓటింగ్, ఫిర్యాదుల్లేని ఎన్నికలు

ప్రపంచం మొత్తం భారతదేశం ఎన్నికలను ఎలా నిర్వహిస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తితో గమనిస్తోందని వ్యాఖ్యానించారు. బీహార్లో నిర్వహించిన భారీ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలాంటి లోపాలు లేకుండా పూర్తయిందని సీఈసి వివరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 7.5కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఈ మొత్తం ప్రక్రియలో ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాకపోవడం, రీపోలింగ్, రీకౌంటింగ్ అవసరం లేకపోవడం విశేషమన్నారు. అందుకు బిఎస్ఓలను ఆయన అభినందించారు.

Gyanesh Kumar: Telangana is a guide for the country in the revision of the voters’ list

కెనడాకంటే తెలంగాణ విస్తీర్ణం పెద్దదన్న జ్ఞానేష్ కుమార్ సమగ్ర ఓటర్ల జాబితా సవరణ పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికల పరిపాలన కొత్తయుగంలోకి అడుగుపెడుతుందని చెప్పారు. బిఎల్ఎలతో జరిగిన చర్చలో పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉండానికి పట్టణ ఓటర్ల నిరాసక్తతే ప్రధాన కారణమన్నారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఉత్సాహంగా క్యూలైన్లలో నిలబడి ఓటుహక్కును వినియోగిస్తూ దేశానికి దారి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో ఎన్నికలు దేశచట్టాల ప్రకారమే నిర్వహించబడతాయని, ఎన్నికల చట్టాలను ప్రతీఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

ఎస్ఐఆర్‌పై తెలంగాణలో సమీక్షా సమావేశం, ఉన్నతాధికారుల పాల్గొనడం

ఈ సమావేశానికి ముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్రెడ్డి తన పరిచయ ప్రసంగంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక గణాంకాలను సవివర పరిచారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లల సంఖ్య, జిల్లాలు, ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాలు తదితర వివరాలను ప్రస్తావించారు. ఈ సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వరరెడ్డి, జీహెచ్ ఎంసి కమిషనర్ ఆర్వి. కర్ణన్, సీనియర్ డిప్యూటీ సీఈసీ పవన్కుమారశర్మ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Election Commission of India Gyanesh Kumar SIR Voters List Special Intensive Revision Telangana Elections Voter List Revision

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.