📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Guvvala Balaraju: బీజేపీ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

Author Icon By Sharanya
Updated: August 10, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) బీజేపీ (BJP) లో చేరారు. ఆదివారం నాడు హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కాషాయ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి గువ్వలతో పాటు ఆయన అనుచరులు, నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు హాజరై బీజేపీ సభ్యత్వం స్వీకరించారు.

Guvvala Balaraju

బీఆర్ఎస్‌కి గుడ్‌బై.. కారణాలు ఇదే

కొన్ని రోజుల క్రితమే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తనపై జరిగిన దాడికి సంబంధించి పార్టీ నాయకత్వం స్పందించలేదని, తగిన ప్రాధాన్యం కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో, ఆయన ఇక ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారన్న చర్చకు తెరలేపి చివరకు బీజేపీలో చేరారు. దీంతో ఆయన్ను చుట్టుముట్టిన ఊహాగానాలకు ముగింపు లభించింది.

మోదీ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలోకి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachandra Rao) మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, దేశవ్యాప్తంగా బీజేపీ పెరుగుతున్న ప్రభావం చూసి గువ్వల బాలరాజు పార్టీ మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నారని వివరించారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని వెల్లడించారు.

సీనియర్ నేతల నుంచి ఘన స్వాగతం

ఈ చేరిక కార్యక్రమానికి ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు హాజరై, గువ్వల బాలరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయ‌న చేరికతో బీజేపీకి కొత్త ఊపొచ్చిందని నేతలు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/khammam-thieves-create-panic-in-district/telangana/528456/

Achampet BJP Breaking News brs Guvvala Balaraju latest news Nagar Kurnool Political News Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.