తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలోకి, చేరడానికి సిద్ధమయ్యారు. ఆయన రాజకీయ ప్రయాణంలో ఇది ఓ కీలక మలుపుగా పలువురు భావిస్తున్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ లో కొనసాగుతున్న అసంతృప్తి చివరకు పార్టీకి గుడ్ బై చెప్పే స్థాయికి తీసుకెళ్లింది.గువ్వల బాలరాజు (Guvvala Balaraju) మాట్లాడుతూ, బీఆర్ఎస్ లో తాను ఆశించిన గౌరవం, ప్రాధాన్యం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రాజకీయంగా పార్టీ కోసం ఎంతగానో కృషి చేసినప్పటికీ, తనకు సరైన గుర్తింపు రాలేదని తెలిపారు. ప్రజల సమస్యలపైనే దృష్టి పెట్టాలని తాను పలుమార్లు నాయకత్వాన్ని కోరినప్పటికీ, స్పందన లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

హైదరాబాద్‌లో భేటీ
ఇప్పటికే ఆయన బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా ఈ రోజు,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchandra Rao) తో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, గువ్వల బాలరాజు అధికారికంగా బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.ఆయన బీజేపీలో చేరే కార్యక్రమాన్ని కూడా ఖరారు చేశారు. ఈ నెల 11వ తేదీ (సోమవారం) నాడు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాలరాజు పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆ కార్యక్రమానికి పలువురు బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.
గువ్వల బాలరాజు ఎవరు?
గువ్వల బాలరాజు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అచ్చంపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
గువ్వల బాలరాజు బీఆర్ఎస్‌కు ఎందుకు రాజీనామా చేశారు?
తనకు బీఆర్ఎస్‌లో తగిన గౌరవం దక్కలేదని, ప్రజా సమస్యలను పార్టీ పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ రాజీనామా చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: