హైదరాబాద్ (నాంపల్లి) : తెలుగు భాషా, సంస్కృతి(Telugu Language and Cuture) పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటు చేసిన తెలుగు విశ్వవిద్యాలయం(Telugu University) ప్రతీయేటా ప్రతిభావంతులకు, మేధావులకు, వివిధరంగాల్లో నిష్ణాతులకు పురస్కారాలు ఇవ్వడమే కాకుండా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో అభిరుచి, ఆసక్తిగత యువతను గుర్తించి వారిలోని సృజనాత్మకశక్తిని పెంపొందించి ప్రోత్సహించే కీలక బాధ్యతను విశ్వవిద్యాలయం దిశగా విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి (Gutha Sukender Reddy) సూచించారు.
విశ్వవిద్యాలయ నాంపల్లి ప్రాంగణంలోని నందమూరి తారక రామారావు పోషించాలని, కళావేదికలో సాయంత్రం విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య వెలుదండ నిత్యా నందరావు సభాధ్యక్షతన జరిగిన 2023 ప్రతిభా పురస్కారాల ప్రదానోత్స వానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గుత్తా సుఖేం దర్రెడ్డి విశిష్ట అతిథులుగా సింగరేణి కాలరీస్ సీఎండి ఎం.బలరామ్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, విస్తరణ సేవావిభాగం అదనపు సంచాలకుడు రింగు రామమూర్తితో కలిసి వివిధరంగాల్లో విశేష సేవలందించిన 12మంది ప్రముఖులు ఎలనాగు (కవిత్వం), డా. ప్రభల జానకి (విమర్శ), ఆచార్య ఆర్. లక్ష్మీ రెడ్డి లేఖనం), ఎ. సంపత్రెడ్డి (శిల్పం), పేరిణి రమేష్ లాల్ (నృత్యం), బి. హరిప్రియ (సంగీతం), కాసుల ప్రతాపరెడ్డి (పత్రికా రంగం), గుమ్మడి గోపాలకృష్ణ (నాటకరంగం), కడకంచి పాపయ్య (జానపద రంగం), ధూళిపాళ మహదేవమణి (అవధానం), ఆచార్య కె.మలయవాసిని (ఉత్తమ రచయిత్రి), డా. శాంతినారాయణ (నవల/కథ)లను మనంగా సత్కరించి ప్రతిభా పురస్కారంతోపాటు 20,116 రూపాయల నగదు, శాలువ, అభినందనపత్రాన్ని అందజేసి వారి సేవలను ప్రశంసించి శుభాభినందనలు తెలిపి ప్రసంగించారు.
మాతృభాష తెలుగును కాపాడుకునే బాధ్యత..
మన మాతృభాష తెలుగును కాపాడుకునే బాధ్యతను హర్షణీయమని ఎం.బలరామ్ అన్నారు. అధ్యక్షోపన్యాసంలో ఆచార్య నిత్యానందరావు పురస్కార గ్రహీతలను సభకు పరిచయంచేస్తూ వారిలోని అసాధారణ ప్రతిభాపాటవాలను వివరించారు. ముందుగా కోట్ల హనుమంతరావు స్వాగతోపన్యాసంలో వివిధ రంగాలలో తెలుగు విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని సవివరపరిచారు. చివరిగా పురస్కార గ్రహీతలు తమ స్పందనలో విశ్వవిద్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు. రింగు రామమూర్తి కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Telangana: తొక్కిసలాట జరగకుండా తెలంగాణ పోలీసుల వినూత్న ఆలోచన