📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News telugu: GST: ఒక్కో ఇంటిపై రూ 13 వేలు ఆదా

Author Icon By Sharanya
Updated: September 12, 2025 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్దిదారులకు సిమెంట్, స్టీల్ పై జీఎస్టీ తగ్గింపుతో ఆర్ధిక భారం తగ్గనుంది. ఈ నెల 22 నుంచి కొత్త ధరలు అమలులోకి రానుండగా, ఒక్కో ఇంటిపై సుమారు రూ.13 వేల వరకు ಆದ್ -అవుతుంది. అయితే, ఈ ప్రయోజనం లబ్దిదారులకు చేరేలా ధరల పర్యవేక్షణపై ప్రభుత్వం దృష్టి సారించాలని -నిపుణులు సూచిస్తున్నారు.

News telugu

జీఎస్టీ శ్లాబ్ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma’s house)-నిర్మాణం చేపడుతున్న లబ్దిదారులకు ఇది నిజంగా “గూర్న్యూసే, ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, జి స్టేల్పై జీఎస్టీ శ్లాబ్ 28 శాతం నుంచి 18 శాతానికి -తగ్గించడంతో లబ్దిదారులకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో లక్షలాది ఇళ్ల నిర్మాణాలకు ఊపందుకోవచ్చని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సగటున 180 సిమెంట్ సంచులు (9 టన్నులు) అవసరం, ప్రస్తుతం ఒక్కో సంచి ధర బ్రాండ్ను బట్టి రూ.330 నుండి రూ.370 వరకు ఉంది. జీఎస్టీ తగ్గింపుతో ఒక్కో సంచిపై సుమారు రూ.30 వరకు ధర తగ్గే అవకాశం ఉంది. ఈ లెక్కన, లబ్దిదారులకు సిమెంట్ ద్వారానే రూ.5,500 వరకు ఆదా కానుంది. ఇక స్టీల్ విషయానికొస్తే ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు 1,500 కిలోల స్టీల్ అవసరం. ప్రస్తుతం కిలో స్టీల్ ధర రూ.70 నుంచి రూ.85 వరకు ఉంది. జీఎస్టీ తగ్గింపుతో కిలో స్టీల్ పై సుమారు రూ.5 తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ప్రతి ఇంటి నిర్మాణంలో స్టీల్ కొను గోలుపై రూ.7,500 వరకు ఆదా అవుతుంది. సిమెం ట్, స్టీల్ రెండింటి పై కలిపి ప్రతి ఇందిరమ్మ ఇంటి లబ్దిదారుడికి సుమారు రూ.13 వేల వరకు ఆర్థిక భారం తగ్గుతుందని అంచనా. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి లబ్దిదారులకు ఎంతో సహాయపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఏడాదికి 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటికే 3.69 లక్షల ఇళ్లకు కేటాయింపులు జరపగా 3.18 లక్షల ఇళ్లకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం 2.05 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ దశలో ఉన్నాయి. అయితే, జీఎస్టీ తగ్గిం పుతో లభించే ప్రయోజనాలను లబ్దిదారులకు పూర్తిగా అందించడంపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినప్పటికీ కొన్ని సిమెంట్, స్టీల్ కంపెనీలు (Cement and steel companies)ధరలనుముందే పెంచేఅవకాశం ఉన్నట్లు ప్రదారం జరుగుతోంది. ఇలా ధరలు పెంచితే, జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం లబ్దిదారులకు పూర్తిగా దక్కకుండా పోవచ్చు.

ధరల పర్యవేక్షణపై దృష్టి.

ఈ పరిస్థితిని నివారించడానికి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల పర్యవేక్షణ కమిటీలు మరింత చురుగ్గా పనిచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ధరలను పర్యవేక్షిస్తేనే జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరుతాయని వారు చెబుతున్నారు. ఈ చర్యలు చేపడితేనే ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా ముందుకు సాగి, పేదల సొంతింటి కల సాకారమవుతుంది.

GST వల్ల నిజంగా ఆదా ఎలా జరుగుతుంది?

GST అమలుతో మునుపటి విధానంలో ఉన్న బహుళ పన్నుల భారం తగ్గింది. మధ్యవర్తుల పన్నులు (Excise, VAT, Service Tax) తొలగిపోవడంతో సరుకుల ధరలు తగ్గాయి. ఈ తగ్గింపుల వల్ల ప్రతి కుటుంబానికి సగటున రూ.13,000 వరకు ఆదా అయ్యిందని ప్రభుత్వం పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/minister-tummala-nageswara-rao-telangana-as-a-seed-hub-for-the-country/telangana/545704/

Breaking News Economy Finance GST GSTBenefits IndianEconomy latest news PublicSavings taxes TaxSavings Telugu News TeluguNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.