📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: GovtHospital-అవయవమార్పిడికి చర్యలు తీసుకోవాలి: మంత్రి దామోదర

Author Icon By Sushmitha
Updated: September 11, 2025 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Govt Hospital: ప్రభుత్వ ఆసుపత్రులలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర(Minister Damodara) రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. జీవన్ దాన్ సంస్థ పనితీరు, ప్రభుత్వ ఆసుపత్రులలో అవయవ మార్పిడి చికిత్సలను విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జూబ్లిహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి అధికారులతో సమావేశం నిర్వహించారు.

అవయవ మార్పిడి కేంద్రాల ఏర్పాటు

మంత్రి మాట్లాడుతూ, నిమ్స్, గాంధీ, ఉస్మానియాతో పాటు ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎంలో కూడా అవయవ మార్పిడి సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రెవల్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ప్రతి అవయవానికి ఒక ప్రత్యేక బృందాన్ని (డెడికేటెడ్ టీమ్) ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ సర్జరీలను ప్రోత్సహించే విధంగా ఈ బృందాలు పనిచేయాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగుకు సూచించారు.

కొత్త నిబంధనలపై చర్చ

కేంద్ర చట్టాన్ని అనుసరించి కొత్త నిబంధనల రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. ఈ కొత్త చట్టం ప్రకారం, సొంత కుటుంబ సభ్యులతో పాటు గ్రాండ్ పేరెంట్స్ కూడా అవయవాలను దానం చేయడానికి, స్వీకరించడానికి అర్హులని అధికారులు తెలిపారు. ఇద్దరు రోగుల కుటుంబ సభ్యులు ఒకరికొకరు అవయవాలు మార్చుకునే (స్వాపింగ్)(Swapping) వెసులుబాటు కూడా ఈ చట్టంలో ఉంటుంది. అవయవ దాన మార్పిడిలో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న నిబంధనలను పరిశీలించి, బాధితులకు సహాయపడే విధంగా నియమాలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

కొత్త చట్టం ప్రకారం అవయవ దానానికి ఎవరు అర్హులు?

కొత్త నిబంధనల ప్రకారం, సొంత కుటుంబ సభ్యులతో పాటు గ్రాండ్ పేరెంట్స్ కూడా అవయవాలు దానం చేయడానికి అర్హులు.

‘స్వాపింగ్’ అంటే ఏమిటి?

ఒక రోగి కుటుంబ సభ్యులు మరొక రోగికి, ఆ రోగి కుటుంబ సభ్యులు మొదటి రోగికి అవయవాలను మార్చుకోవడం.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-vijayawada-skill-training-course-for-the-unemployed/andhra-pradesh/545151/

Google News in Telugu government hospital health sector Latest News in Telugu Minister Damodar Rajanarasimha Telangana. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.