हिन्दी | Epaper
హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

Jishnu Dev Varma : ఆర్డినెన్స్ న్యాయ సలహాకు గవర్నర్!

Sudheer
Jishnu Dev Varma : ఆర్డినెన్స్ న్యాయ సలహాకు గవర్నర్!

బీసీలకు 42% రిజర్వేషన్లు (42% Reservation for BCs) కల్పించే అంశంపై ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వద్దకు రెండు రోజుల క్రితమే చేరింది. అయితే ఇప్పటికీ గవర్నర్ ఆర్డినెన్స్‌పై తన నిర్ణయం ప్రకటించకపోవడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇది ఒక ప్రధాన విషయంగా మారడంతో గవర్నర్ ఆర్డినెన్స్‌లోని అంశాలపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.

నేడు లేదా రేపు నిర్ణయం తీసే అవకాశం

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) ఈ రోజు లేదా రేపు ఆర్డినెన్స్‌పై సంతకం చేస్తారో లేదో ఇంకా స్పష్టత లేదు. ఈ అంశంపై ఆయన న్యాయ నిపుణులతో చర్చించి అన్ని కోణాలు పరిశీలిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలిస్తే, రాష్ట్రంలోని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలులోకి వస్తుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు మార్గదర్శకాలు కూడా పంపించనున్నారు.

ఎన్నికల షెడ్యూల్ సిద్ధం చేసే దిశగా ప్రభుత్వం

ఆర్డినెన్స్‌కు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులను అలర్ట్ చేసింది. స్థానిక సంస్థలలో బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దీనిపై గవర్నర్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి. నిర్ణయం ఎలా వచ్చినా, రాష్ట్రంలో రాజకీయ వేడి మరోసారి పెరిగే అవకాశముంది.

Read Also : Vijay Devarakonda : డెంగ్యూ తో హాస్పటల్లో చేరిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870