Government Colleges: ప్రభుత్వ జానియర్ కాలేజీల్లోమొదటి సంవత్సరంలో 94,155 మంది చేరిక

Read Time:  1 min
Government Colleges:
Government Colleges:
FONT SIZE
GET APP

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2025-26లో మొదటి సంవత్సరంలో 94,155 మంది చేరారు. జులై 31 వరకు 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 94,155 మంది చేరారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఇప్పటి వరకు అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. గత ఏడాది కంటే ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో (government junior colleges) అడ్మిషన్లను పెంచాలని ఇంటర్ విద్య డైరక్టర్ ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఇంటర్ విద్యాధికారులు, జూనియర్ లెక్చరర్లు, ఇతర సిబ్బంది అడ్మిషన్లను పెంచేలా చర్యలు తీసుకున్నట్టు ఇంటర్ విద్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఈ ఏడాది ఇప్పటి వరకు అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. గత ఏడాది 83,844 మంది ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరగా.. ఈ ఏడాది ఇప్పటికే 94,155 మంది చేరారు.

ఎయిడెడ్ కాలేజీల్లో

ఈ ఏడాది 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,47,588 మంది విద్యార్థులను చేర్చాలని లక్ష్యంగా పెట్టు కోగా.. వారిలో ఇప్పటి వరకు 94,155 మంది. చేరారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరడానికి ఈ నెల 20 వరకు గడువును పొడిగిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నేపథ్యంలో మరో 18 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో లక్ష్యం చేరడం కోసం ఇంటర్ విద్యాశాఖ అధికారులు (Inter Education Officers) కసరత్తు చేస్తు న్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్, ఎయిడెడ్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియను ఈ నెల 20 వరకు కొనసాగించనున్నారు. జులై 31 వరకు ఉన్న ఇంటర్ అడ్మిషన్ల రెండో విడత షెడ్యూల్ను పెంచుతూ ఇంటర్ బోర్డు గురువారం నిర్ణయం తీసుకుంది.

Government Colleges:
Government Colleges:

ఇంటర్ బోర్డు కార్యదర్శి

మే 31తో మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నేపద్యoలో మే 31 వరకు జరిగిన అడ్మిషన్ల ప్రక్రియను జూన్ 30తో పూర్తి చేయాలని మే 1న జారీ చేసిన మొదటి విడత షెడ్యూల్లో ఇంటర్ బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. జూన్ 27న ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వెలువడిన నేపథ్యంలో జులై 31 వరకు రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియకి ఇంటర్ బోర్డు షెడ్యూల్ను జారీ చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రకటన జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకులాలు, మోడల్ స్కూల్, కేజీబీవీలు, కంపోజిట్ కాలేజీలు అన్ని కూడా ఈ నెల 20 వరకు అడ్మిషన్లు తీసుకోవచ్చ తీసుకోవచ్చని మరోసారి ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల సంఖ్య ఎంత?

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 400 కంటే ఎక్కువ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి.

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎలాంటి కోర్సులు అందిస్తారు?

MPC, BiPC, CEC, MEC, HEC వంటి సైన్స్, కామర్స్, ఆర్ట్స్ కోర్సులు అందిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: 

https://vaartha.com/fertility-centers-tg-government-takes-strict-action-against-fertility-centers/telangana/524843/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.