📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Government Bills: ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో కొత్త నిబంధనలు

Author Icon By Pooja
Updated: December 21, 2025 • 4:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు అమలు చేస్తోంది. బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో సాంకేతికతను వినియోగించడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ, తాజా నిబంధనలు మాత్రం లబ్ధిదారులకు ఇబ్బందిగా మారుతున్నాయి. ముఖ్యంగా పాత ఇళ్లకు బిల్లులు(Government Bills) పొందాలనే అవకాశం లేకుండా చేయడం వల్ల పలువురు లబ్ధిదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Read Also: TG Job Calendar: నిరుద్యోగులకు శుభవార్త.. TPSC ఉద్యోగాల షెడ్యూల్

నోటీసులు, రద్దుల పెరుగుదల

ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో భాగంగా ఈ ఏడాది జనవరిలో తొలి విడత, మే నెలలో రెండో విడత ఇళ్లను ప్రభుత్వం ఆమోదించింది. అయితే మంజూరు పత్రం అందిన 45 రోజులలోపు నిర్మాణ పనులు ప్రారంభించాల్సిన నిబంధన ఉండటంతో, ఆలస్యం చేస్తున్న లబ్ధిదారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా పనులు మొదలుపెట్టని కారణంగా చాలామంది లబ్ధిదారులు తమ ఇళ్లను స్వచ్ఛందంగా రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

జియో ట్యాగింగ్‌తో పాత ఇళ్లకు చెక్

కొంతమంది లబ్ధిదారులు గతంలో మాదిరిగానే పాత ఇల్లు లేదా రేకుల షెడ్డుకు బిల్లులు పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఒకే ఇంటిలో ఉన్న నాలుగు గదుల్లో ఏదో ఒక గది పేరుతో బిల్లు తీసుకోవాలని భావిస్తున్నా, ప్రతీ ఇంటికి జియో ట్యాగింగ్‌,(Government Bills) ఫొటో చిత్రీకరణ తప్పనిసరి కావడంతో పాత ఇళ్లకు బిల్లులు పొందే అవకాశం లేకుండా పోయింది. ఇంటి నిర్మాణం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు సాంకేతిక పర్యవేక్షణ ఉండటంతో కొందరు ఇళ్లు కట్టుకోవడానికి వెనకాడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వేగం.. పట్టణాల్లో కొత్త గుర్తింపు

ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకు మాత్రమే మంజూరు చేయగా, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ ముగియడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ పనులకు అధికారులు వేగం పెంచారు.

ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సెప్టెంబర్ 11 నుంచి ప్రత్యేక కాల్ సెంటర్‌ను ప్రారంభించింది. లబ్ధిదారులు ఆదివారం మినహా మిగతా రోజుల్లో 1800 599 5991 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు నమోదు చేయవచ్చని అధికారులు తెలిపారు. బిల్లులు పెండింగ్‌లో ఉండటం, అధికారుల అక్రమాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తుండగా, సాంకేతిక కారణాలతోనూ చెల్లింపులు నిలిచిపోతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో లబ్ధిదారులు పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Housing Scheme Update Indiramma Houses Indiramma Illu Scheme

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.