📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం

Author Icon By Sharanya
Updated: February 14, 2025 • 10:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) పెనుమార్పులకు కారణమవుతున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం గూగుల్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ ఉద్యోగులు కలిపి 1.2 లక్షల మందికి AI శిక్షణ ఇవ్వనున్నారు. టీ హబ్‌లో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుల సమక్షంలో గూగుల్‌ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రీతి లోబానాతో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌‌లు పాల్గొన్నారు. ప్రధానంగా వ్యవసాయం, సుస్థిరాభివృద్ధి, పరిపాలన, రవాణా, విద్య తదితర కీలక విభాగాల్లో ఏఐ సేవలనే వినియోగించడమే ఈ ఒప్పందం లక్ష్యం.

విద్యార్థులకు :
టెక్నాలజీపై అవగాహన, నూతన అవకాశాలు.గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ ద్వారా ఏఐ నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమాలపై దృష్టి సారిస్తుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ అభ్యసన పద్దతులను ప్రారంభిస్తుంది. గూగుల్ వర్క్ స్పేస్, క్రోమ్ సర్వీసెస్ ను అందిస్తుంది. గూగుల్ డేటా కామన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఓపెన్ డేటా యాక్సెస్‌ను మెరుగుపరుస్తుంది. 500 పాఠశాలల్లో 100 మంది చొప్పున మొత్తం 50 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇప్పించునున్నారు.

వ్యవసాయ రంగం:
పంటలు, గాలి, వర్షపాతం విశ్లేషణకు ఏఐ మద్దతు రవాణా సదుపాయాలను మెరుగుపరిచే డేటా ఇంటిగ్రేషన్ సదుపాయాల కల్పనలోనూ భాగస్వామ్యం పంచుకుంటుంది. రైతులకు అవసరమైన ఇన్పుట్, రెడిట్, మార్కెటింగ్ సదుపాయాలన్నీ అనుసంధానం చేస్తూ తెలంగాణ ఓపెన్ అగ్రికల్చర్ నెట్‌వర్క్ ను ప్రారంభిస్తుంది.

ఆరోగ్య రంగం:
డిజిటల్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ టీ-హబ్‌లో గూగుల్‌ ఒప్పంద కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఏఐ వినియోగంలో తెలంగాణ దార్శనికతకు గూగుల్‌ సహకారం ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. ఏఐ టెక్నాలజీతో కీలక రంగాలలో విప్లవాత్మక మార్పులు తేవాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. మెరుగైన పాలన, ఆర్థిక పురోగతితో పాటు ప్రజా సేవలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని, ఈ లక్ష్య సాధనలో గూగుల్‌ ఒప్పందం కీలకంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గూగుల్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ ప్రీతి లోబానా మాట్లాడుతూ, ఏఐ ఆధారిత మానవ వనరులను పెంచడం, స్టార్ట్‌పలను ప్రోత్సహించడం, వ్యవసాయం, విద్య లాంటి కీలక రంగాల్లో పని చేయటం ఉత్సాహంగా ఉందని అన్నారు.

ట్రాఫిక్ సమస్యలకు AI పరిష్కారాలు:

హైదరాబాద్ నగరంలో విస్తృతంగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొనేందుకు, Google సహాయంతో AI ఆధారిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాఫిక్ నియంత్రణ, స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, నగరాభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు హైదరాబాద్ నగరంలోని 7 కీలక కూడళ్లలో ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా రహదారుల విస్తరణ, అనవసర ట్రాఫిక్ ఆలస్యాలు తగ్గే అవకాశముంది. చర్యల ద్వారా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం అందించనున్నారు. ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

#ArtificialIntelligence #CMRevanthReddy #DigitalIndia #google #googleai #telengana Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.