📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Employees : ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. త్వరలో రెండు డీఏలు!

Author Icon By Sudheer
Updated: May 28, 2025 • 7:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఉద్యోగులకు (Employees ) శుభవార్త చెప్పేందుకు ముస్తాబవుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం పెండింగ్‌లో ఉన్న రెండు డీఏ (DA)లను చెల్లించేందుకు ప్రభుత్వ ఉన్నత స్థాయి కసరత్తు జరుపుతున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయానికి దారితీసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు, ఉద్యోగుల సంక్షేమం కోసం మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

రిటైర్మెంట్ రోజునే బెనిఫిట్స్ చెల్లింపునకు సూచన

పెండింగ్‌లో ఉన్న డీఏలతో పాటు, ఉద్యోగులు రిటైర్ అయ్యే రోజునే పింఛన్, గ్రాట్యుటీ, ఇతర సదుపాయాల్లో కొంత మొత్తాన్ని వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటి వరకు లేట్‌గా వచ్చే ఈ బెనిఫిట్స్ ఇకపై నిర్దిష్ట సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకొని ఆఖరి దశ చర్చలు జరుగుతున్నాయి.

క్యాబినెట్ సబ్ కమిటీలో తుది నిర్ణయానికి అవకాశం

ఈ అంశాలపై రేపు జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉద్యోగుల డీఏ చెల్లింపుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డీఏల చెల్లింపుతో వారికి ఆర్థిక భారం కొంత తరిగే అవకాశం ఉంది.

Read Also : PCC : పీసీసీ కార్యవర్గం కూర్పుపై శ్రేణుల్లో ఉత్కంఠ

cm revanth DA Employees DA Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.