📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HYD : నగరవాసులకు గుడ్ న్యూస్ ..సౌత్ హైదరాబాద్‌లో తగ్గనున్న ట్రాఫిక్

Author Icon By Sudheer
Updated: August 13, 2026 • 1:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

HYD : హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘హెచ్-సిటీ’ (H-City) ప్రాజెక్టులో భాగంగా సౌత్ హైదరాబాద్ పరిధిలోని ప్రధాన రహదారులలో ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ. 242.72 కోట్ల వ్యయంతో మూడు భారీ రోడ్డు మౌలిక వసతుల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టును ప్రముఖ ‘కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్’ (KNR Constructions) సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్స్ట్రక్షన్ (EPC) విధానంలో చేపట్టే ఈ పనులను రాబోయే 24 నెలల్లో పూర్తి చేయాలని కాలపరిమితి విధించారు.

Read Also : మాజీ MLA రేగా కాంతారావు అరెస్ట్?

మూడు కీలక ఫ్లైఓవర్ ప్రాజెక్టులు: మహేశ్వరం, బాలాపూర్ మార్గాల్లో మారనున్న రూపురేఖలు

ఈ ప్రాజెక్టు ద్వారా పాతబస్తీ, దక్షిన హైదరాబాద్‌లోని అతిముఖ్యమైన ప్రధాన జంక్షన్లలో రద్దీ గణనీయంగా తగ్గనుంది. ప్రధానంగా ఒవైసీ ఫ్లైఓవర్‌కు లెఫ్ట్ ఆర్మ్ డౌన్ ర్యాంప్‌ను నిర్మించడంతో పాటు, హఫీజ్‌బాబా నగర్ నుంచి బాలాపూర్-చర్చ్ రోడ్ వరకు ఆరు లేన్ల ‘టూ-వే గ్రేడ్ సెపరేటర్’ ను చేపడతారు. అలాగే బండ్లగూడ-ఎర్రకుంట క్రాస్‌రోడ్ వద్ద ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, శ్రీశైలం హైవే వైపు ప్రయాణించే వాహనదారులకు సులభతరమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం లభించనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Hyderabad H City Project Latest News in Telugu Owaisi Flyover Left Arm Ramp South Hyderabad South Hyderabad Traffic Solutions Telugu News Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.