📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

Author Icon By Saritha
Updated: March 5, 2026 • 4:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Godavari Pushkaralu: తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న గోదావరి పుష్కరాల (2027) కోసం ప్రభుత్వం ఇప్పుడే ముందస్తు ఏర్పాట్లను ప్రారంభించింది. ‘దక్షిణ కుంభమేళా’గా పిలుచుకునే ఈ మహా క్రతువును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

కమిటీ సభ్యులుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పి.సుదర్శన్ రెడ్డిలను నియమించారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అవసరాన్ని బట్టి గోదావరి తీర ప్రాంతాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశాలకు పిలవనున్నారు. త్వరలోనే కమిటీ సమావేశమై సిఫార్సులను అందజేయనుంది.

Read Also: KTR: ఎవరి ఇళ్లను కూల్చకుండా మూసీ పనులు చేయవచ్చు

Godavari Pushkaralu Telangana government’s efforts for Godavari Pushkaralu

కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈసారి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారు 560 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహిస్తుండటంతో దాదాపు 74 ఘాట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. పుష్కరాల ఏర్పాట్లు తాత్కాలికంగా కాకుండా, శాశ్వత ప్రాతిపదికన ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఆలయాల అభివృద్ధి, పర్మనెంట్ పుష్కర ఘాట్లు, రోడ్లు, వసతి సముదాయాలు నిర్మించాలని ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

CM Revanth Reddy Godavari Pushkaralu 2027 Sridhar Babu Telangana Cabinet Sub Committee

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.