📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Banakacherla Project : కేసీఆర్ సలహాతోనే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు – రేవంత్ రెడ్డి

Author Icon By Sudheer
Updated: June 19, 2025 • 7:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణకు జీవిత నదులైన గోదావరి, కృష్ణా జలాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) స్పష్టంచేశారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project)పై ఏర్పడిన రాజకీయ దుమారంపై అన్ని పార్టీల ఎంపీలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టును అడ్డుకోవడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాటానికి సిద్ధమైందని చెప్పారు. కేంద్రం ముందు బలమైన వాదనలు వినిపించి, ప్రాజెక్టుకు అనుమతి రాకుండా చూస్తామని అన్నారు.

కేసీఆర్‌తోనే ప్రాజెక్ట్‌కు అంకురార్పణ

ఈ ప్రాజెక్టుకు మదుపు ప్రారంభం 2016లోనే జరిగిందని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్‌లో గోదావరి మిగులు నీటి వినియోగాన్ని ప్రతిపాదించారని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ సూచనల ప్రకారమే అనంతరం జగన్‌తో సమావేశాలు జరిగాయని, ఇదే ప్రాజెక్టు ఇప్పుడు బనకచర్ల రూపంలో ముందుకు సాగుతోందన్నారు. రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుందని మీడియా ముందు కూడా కేసీఆర్ మాట్లాడిన విషయాన్ని రికార్డు ఆధారంగా గుర్తు చేశారు.

విపక్షాల విమర్శలు – వాకౌట్ చేసిన బీఆర్‌ఎస్‌

సమావేశంలో సీఎం వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ విమర్శల సమయం కాదని, ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు వ్యూహం రూపొందించాల్సిన సమయమని పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరంగా తాము సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రాజెక్ట్ పరిణామాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్ట్ తెలంగాణకు కలిగించే నష్టాలు, కేంద్రంపై ఒత్తిడిని ఎలా ముమ్మరం చేయాలో అంశాలపై చర్చలు జరిపారు.

Read Also : Jagan Tour : పరామర్శ పేరుతో.. మరో రెండు ప్రాణాలను బలి తీసుకున్నాడు

Banakacherla Project brs cm revanth Google News in Telugu KCR

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.