భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Global Summit2025) ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రత్యక్షంగా సమీక్షించారు. ప్రపంచంలోని పలు దేశాల నుంచి ప్రతినిధులు, అంబాసిడర్లు హాజరయ్యే అవకాశం ఉన్నందున కార్యక్రమం నిర్వహణ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. సమ్మిట్‌కు సంబంధం లేని వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. పాస్‌లు ఉన్న అధికారులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అన్నారు.
Read Also: Chandrababu: కొత్త జిల్లాలపై దృష్టి: నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశం
మీర్‌ఖాన్‌పేట్‌లో ఏర్పాట్ల సమీక్ష
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంలో, డిసెంబర్ 8, 9 తేదీల్లో సమ్మిట్ నిర్వహించేందుకు మీర్‌ఖాన్‌పేట్‌లో జరుగుతున్న ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పలు సూచనలు చేశారు. వివిధ దేశాల అతిథులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
భద్రత, పార్కింగ్ & లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
సమ్మిట్(Global Summit2025) ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం కావడంతో, భద్రత విషయంలో ఎలాంటి రాయితీ లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని సీఎం తెలిపారు. పోలీస్ బందోబస్తు, పార్కింగ్ వంటి అంశాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ప్రణాళిక చేయాలని సూచించారు. అదే సందర్భంలో, నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులను కూడా ఆయన పరిశీలించారు.
పరిశ్రమల అభివృద్ధి & పాలసీ డాక్యుమెంట్ సిద్ధత
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పెట్టుబడిదారులకు స్పష్టతనిచ్చే విధానపరమైన పాలసీలు కీలకమని రేవంత్ రెడ్డి అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ముందంజలో కొనసాగుతోందని, భారీ పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం సృష్టించేందుకు కొత్త పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సమ్మిట్-2025 కోసం శాఖల వారీగా పాలసీ డాక్యుమెంట్లు సిద్ధం చేయాలని, వాటిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడానికి అధికారాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా అన్ని విభాగాలు తమ తమ పాలసీ పత్రాలను పూర్తి చేయాలని సూచించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: