📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Global Summit: మాకు పోటీ  చైనా, జపాన్ దేశాలతోనే..రేవంత్ రెడ్డి

Author Icon By Saritha
Updated: December 8, 2025 • 5:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం(Global Summit) ఆధ్వర్యంలో జరిగే మూడు రోజుల గ్లోబల్ సమ్మిట్ నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రసంగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ఆగతులు, పెట్టుబడిదారులకు అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. తెలంగాణ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, మనకు మహాత్మాగాంధీ, అంబేద్కర్ స్ఫూర్తి. తెలంగాణ భవిష్యత్తుకు 2047 వరకు కొత్త ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించాము. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించాము. దేశ GDPలో తెలంగాణ 2047 నాటికి 10% వాటాను అందించాలి. రాష్ట్ర అభివృద్ధి రంగాలను సేవ, తయారీ, వ్యవసాయం వంటి మూడు విభాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా లక్ష్యాలను నిర్ణయించామని, తెలంగాణ దేశంలోనే ఈ విధంగా ప్రణాళిక చేసుకున్న మొట్టమొదటి రాష్ట్రమని వెల్లడించారు.

Read also: భారత్‌లో స్టార్‌లింక్ సేవలు, ప్లాన్‌ ధరలు వెల్లడించిన మస్క్‌

అంతర్జాతీయ ప్రేరణలు, ప్రజల భాగస్వామ్యం

రేవంత్ రెడ్డి(Global Summit) చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల అభివృద్ధి నమూనాల నుంచి ప్రేరణ పొందామని, తెలంగాణ కూడా ఆ దేశాలతో పోటీ చేయాలని ప్రణాళిక బలంగా ఉందని చెప్పారు. ఈ విజన్ కష్టమయినప్పటికీ సాధ్యమని, రాష్ట్రవాసుల మద్దతుతో అన్ని లక్ష్యాలను చేరుకునే ఆశతో ఉందని పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతూ, ప్రజల ఆలోచనలు, అంచనాలను తెలుసుకొని భవిష్యత్తులో తెలంగాణ కలలను నెరవేర్చాలని ప్రభుత్వం సంకల్పించిందని, ఈ ప్రయాణంలో అందరి మద్దతు కీలకం అని అన్నారు. తెలంగాణ రైజింగ్ అనేది నిరంతర అభివృద్ధి ప్రక్రియ అని స్పష్టంచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Development Goals Economic Growth future planning Global Summit hyderabad International Inspiration Investment Revanth Reddy Telangana Telangana Rising 2047

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.